Leading News Portal in Telugu

Gold Price Today: మగువలకు షాకింగ్ న్యూస్‌.. నేడు తులం బంగారంపై ఎంత పెరిగిందో తెలుసా?


Gold Price Today in Hyderabad on 5th September 2023: ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 60 వేలు దాటేసింది. దాంతో బంగారం అంటేనే చాలా మంది జంకుతున్నారు. ఎప్పుడెప్పుడూ తగ్గుతుందా? అని చూస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. సోమవారం కాస్త శాంతించినట్లు కనిపించిన పసిడి ధరలు నేడు మళ్లీ పెరిగాయి.

బులియన్ మార్కెట్‌లో మంగళవారం (సెప్టెంబర్ 5) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,300 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,320గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,470గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,650 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,320గా కొనసాగుతోంది.

నేడు పసిడి ధర పెరిగితే వెండి ధర మాత్రం కాస్త తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర ఈరోజు రూ. 76,200లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 700 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 76,200గా ఉండగా.. చెన్నైలో రూ. 80,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 75,500 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 80,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,000ల వద్ద కొనసాగుతోంది.