Mukesh Ambani Sister: ఆసియా ఖండపు అపర కుబేరుడు ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నిత్యం ఆయన, ఆయన ఫ్యామిలీ వార్తల ముఖ్యాంశాల్లో నిలుస్తూనే ఉంటారు. అంబానీ సోదరులు అనిల్ అంబానీ, ముఖేష్ గురించి మనందరికీ తెలుసు కానీ వారి ఇద్దరు సోదరీమణులు దీప్తి అంబానీ, నీనా కొఠారి గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సోదరీమణులిద్దరూ ఎప్పుడూ లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటారు.
అంబానీ తోబుట్టువులలో దీప్తి సల్గావ్కర్ చిన్నది. ఆమె 23 జనవరి 1962న భారతీయ వ్యాపార దిగ్గజం ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ దంపతులకు జన్మించారు. దీప్తి సల్గావ్కర్ వీఎం సల్గావ్కర్ కాలేజ్ ఆఫ్ లాలో లా చదివారు. ఆమె గోవాకు చెందిన వ్యాపారవేత్త దత్తరాజ్ సల్గావ్కర్‌ను వివాహం చేసుకుంది. వారిద్దరూ 1983లో వివాహం చేసుకొని సల్గావ్‌కర్ కుటుంబానికి చెందిన మాన్షన్‌లో స్థిరపడ్డారు. ఇది ప్రేమ వివాహమని దత్తరాజ్ సల్గాంకర్ కొన్నాళ్ల క్రితం డీఎన్‌ఏకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధృవీకరించారు. దీప్తి సల్గాంకర్ నికర విలువ 2023లో సుమారు 1 బిలియన్ డాలర్ (రూ. 7710 కోట్లు)గా అంచనా వేయబడింది.
దీప్తి అంబానీని, ఇప్పుడు దీప్తి సల్గాంకర్ అని పిలుస్తారు. తను భారతీయ వ్యాపార వేత్త. ఆమె భర్త దత్తరాజ్ సల్గాంకర్‌కు గోవా నుండి ఫుట్‌బాల్ జట్టు ఉంది. వీరికి ఇద్దరు పిల్లలు, కూతురు ఇషిత, కుమారుడు విక్రమ్ ఉన్నారు. దీప్తి అంబానీ లైమ్‌లైట్‌కి దూరంగా ఉంటుంది. ఆమె గురించి పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా సమ్మేళనం.. దీప్తి అంబానీ దాని ఏకైక వారసురాలు.