ప్రముఖ టెలికాం దిగ్గజం జియో అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది.. ఇప్పటికే ఎన్నో ఆఫర్స్ ను ప్రకటించిన కంపెనీ ఇప్పుడు మరో గుడ్ న్యూస్ ను తెలిపింది.. 7వ వార్షికోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన యూజర్లకు ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తున్నట్లు అధికారికంగా తెలిపింది.. ఇందులో భాగంగా రూ.299 ప్లాన్‌లో 7జీబీ డేటా,రూ.749 ప్లాన్‌లో 14జీబీ, రూ.2999 ప్లాన్‌లో 21 జీబీ డేటాను అదనంగా ఇస్తుంది. వీటితో పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ వీక్షించే అవకాశం కల్పించడంతో పాటు.. ఫుడ్ ఆఫర్స్ ను ప్రకటించింది..
రూ.299 ప్లాన్..
రూ.299 ప్లాన్‌లో జియో కస్టమర్లు ప్రతిరోజు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు రోజువారీ 2జీబీ డేటాను అందిస్తుంది. ప్రత్యేకంగా జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లో జియో వార్షికోత్సవ ఆఫర్‌లో అదనంగా 7జీబీ డేటా కూడా ఉంది. ఈ ప్లాన్‌కి 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది..
రూ.749 ప్లాన్..
ఈ రూ. 749 జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లో ప్రతి రోజు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజు 100 ఎస్‌ఎంఎస్‌లు పంపుకోవచ్చు. కస్టమర్‌లు అదనంగా 14జీబీ డేటాను అందుకుంటారు. 90 రోజుల వ్యాలిడిటీతో 7జీబీ డేటాను రెండుసార్లుగా 14జీబీ డేటాను పొందుతారు..
రూ.2,999 ప్లాన్..
అదే విధంగా రూ.2,999 ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు, 2.5జీబీ డేటాను అందిస్తుండగా..ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా కస్టమర్‌లు అదనంగా 21జీబీ డేటాను అందుకుంటారు. మూడు సార్లు 7జీబీ డేటాను జియో కూపన్‌ల రూపంలో అందిస్తుంది. కాగా, కొత్త జియో వార్షికోత్సవ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది..
అంతేకాదండోయ్.. అజియో పై రూ.200 రూపాయల వరకు భారీ తగ్గింపు ఆఫర్ ఉంది.. స్విగ్గీలో రూ.100 తగ్గింపు, రిలయన్స్ డిజిటల్‌లో 10 శాతం తగ్గింపు పొందవచ్చు.తరచుగా ప్రయాణం చేసే వారికి విమానా ఛార్జీలలో రూ.1500, హోటళ్లపై 15 శాతం తగ్గింపు, ట్రావెల్ ఏజెన్సీ వెబ్‌పోర్టల్ యాత్రలో ఏదైనా హోటల్స్‌ను బుక్ చేసుకుంటే రూ. 4000 వరకు డిస్కౌంట్, భోజన ప్రియులైతే రూ.149 కంటే ఎక్కువ ధర ఉన్న ఫుడ్ ఐటమ్స్‌ను ఫ్రీగా తినే అవకాశాన్ని కూడా జియో అందిస్తుంది..
రూ.1099 ప్లాన్ – 84 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 2జీబీ డేటాను పొందవచ్చు. అయితే, 5జియో వెల్‌కమ్ ఆఫర్‌లో 5జీ నెట్‌వర్క్ సపోర్ట్ చేసే మొబైల్‌పై అన్‌లిమిటెడ్ 5జీ డేటాను పొందవచ్చు..
రూ.1499 ప్లాన్ – ఈ ప్లాన్‌లో బేసిక్ నెట్‌ఫ్లిక్స్ ఆఫర్స్ సొంతం చేసుకోవచ్చు. మొబైల్స్, ట్యాబ్స్ ,ల్యాప్‌టాప్‌లు, టీవీలలో 720పీలో చూడొచ్చు.నెట్‌ఫ్లిక్స్ బండిల్‌తో పాటు, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజువారీ 3జీబీ డేటాను సైతం సొంతం చేసుకోవచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు త్వరపడండి..