కరోనా తర్వాత ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటున్నారు.. భీమాను తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి.. కొన్ని పరిస్థితుల్లో ఆర్ధిక కష్టాలను అధిగమించవచ్చు.. అయితే పాలసీ తీసుకునే ముందు పలు అంశాలను పరిశీలించాలి. చాలా పాలసీలు అందుబాటులో ఉంటాయి. టర్మ్ ప్లాన్ దగ్గరి నుంచి హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వంటివి ఉన్నాయి. అప్పుడు మీ మీద ఆధారపడిన వారికి మీరు లేకున్నా కూడా ఎలాంటి ఆర్థిక కష్టాలు దరి చేయవు…
ఇప్పుడు మనం పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ ప్లాన్ ను చూస్తే.. తక్కువ మొత్తంతోనే మీరు అధిక కవరేజ్ పొందొచ్చు. ప్రమాదవ శాత్తు మరణిస్తే.. అప్పుడు మీ కుటుంబ సభ్యులకు ఈ ఇన్సూరెన్స్ డబ్బులు లభిస్తాయి. అందువల్ల బైక్ , స్కూటర్, కారు వంటి వెహికల్స్ కలిగిన వారు ఈ పాలసీ పొందొచ్చు. ఆటో డ్రైవర్లు, ఇతర వెహికల్స్ నడిపే వారు కూడా బీమా కలిగి ఉండటం ఉత్తమం. అలాగే వెహికల్స్ లేని వారు కూడా ఈ పాలసీ తీసుకోవడం మంచిదే.ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పడం కష్టం కదా..
ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తక్కువ ప్రీమియంతోనే అదిరే పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ను అందిస్తోంది. మీరు కేవలం రూ. 575 ప్రీమియంతోనే ఏకంగా రూ. 25 లక్షల వరకు బీమా పొందొచ్చు. రూ.10 లక్షల బీమాకు రూ.230 చెల్లిస్తే సరిపోతుంది. అంటే రూ.లక్షకు రూ.23 ప్రీమియం పడుతుందని చెప్పుకోవచ్చు. ఈ పాలసీ టర్మ్ ఏడాది మాత్రమే ఉంటుంది. ఏడాది టర్మ్ అయిపోయిన తర్వాత ఈ పాలసీ పని చేయదు.. 18 నుంచి 55 వయస్సు కలిగిన వాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు..
ఇకపోతే ఈ పాలసీ తీసుకునే వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సూసైడ్ చేసుకొని మరణిస్తే.. ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తించదు. ఇంకా టెర్రరిస్ట్ దాడి వల్ల మరణించినా కూడా ఇన్సూరెన్స్ డబ్బులు రావు. అలాగే ప్రమాదంలో గాయాలు తగిలినా కూడా మీరు పాలసీ మొత్తం పొందలేరు. ప్రమాదంలో మరణించడం లేదా శాశ్వత అంగవైకల్యం సంభవిస్తేనే పాలసీని క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.. అందుకే పాలసిని తీసుకొనేవారు ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి.. గతంతో పోలిస్తే ఈ ఏడాది పాలసీలు తీసుకొనేవారి సంఖ్య ఎక్కువైంది..