ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు ఎస్‌బీఐ తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు అదిరిపోయే ఆఫర్స్ ను అందిస్తుంది.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే ఎన్నో పథకాలను అందిస్తూ వస్తుంది..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ రికరింగ్ డిపాజిట్ సేవలు అందిస్తోంది. ఈ బ్యాంక్ లో ఆర్‌డీ అకౌంట్ తీసుకుంటే అదిరే బెనిఫిట్స్ పొందొచ్చు. మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి చేతికి రూ. 18 లక్షల వరకు అందుకోవచ్చు. రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వారు ఇలా ప్రతి నెలా డబ్బులను కట్టవచ్చు..
ఈ బ్యాంకు ప్రస్తుతం తన కస్టమర్లకు రికరింగ్ డిపాజిట్లపై 7.5 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌కు ఉంటుంది. అదే మీరు టెన్యూర్ మారిస్తే.. వడ్డీ రేటు కూడా మారుతుంది. ఏడాది నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో మీరు డబ్బులు పొదుపు చేసుకోవచ్చు.. పదేళ్ల మెచ్యూరిటీ టెన్యూర్‌తో మీరు నెల నెలా డబ్బులు దాచుకుంటే.. మెచ్యూరిటీ సమయంలో ఎంత మొత్తం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. పదేళ్ల టెన్యూర్‌పై 7.5 శాతం వరకు వడ్డీ పొందొచ్చు.. నెలకు ఐదు వేల చొప్పున ఇన్వెస్ట్ చెయ్యాల్సి వస్తుంది.. మెచ్యూరిటీ టైం కు రూ.9లక్షలు చేతికి వస్తాయి..ప్రతి నెలా చిన్న మొత్తంతో డబ్బులు దాచుకుంటే మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తం సొంతం చేసుకోవచ్చు. అదే మీరు ఐదేళ్ల టెన్యూర్‌తో డబ్బులు దాచుకుంటే అప్పుడు మీకు మెచ్యూరిటీ సమయంలో రూ. 3.64 లక్షలు వస్తాయి..
ఎక్కువకాలం పొదుపు చెయ్యాలని భావించే వారు ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వొచ్చు..మీరు నెలకు రూ.10 వేలు చొప్పున పొదుపు చేస్తే.. ఐదేళ్ల టెన్యూర్‌లో చేతికి ఒకేసారి రూ. 7.28 లక్షలు లభిస్తాయి. అదే పదేళ్ల వరకు టెన్యూర్ ఎంచుకుంటే.. మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ.18 లక్షల వరకు లభిస్తాయి. ఇలా మీరు డిపాజిట్ చేసే మొత్తం పెరిగే కొద్ది మీకు వచ్చే రాబడి కూడా పైపైకి చేరుతుంది.. మీరు డబ్బులు పెట్టేదాన్ని బట్టి లాభం కూడా పెరుగుతూ వస్తుంది..