Car Loan: ప్రతి ఒక్కరూ ఖరీదైన, విలాసవంతమైన కార్లను కొనేందుకు ఇష్టపడుతారు. తద్వారా వారు తమ కుటుంబంతో లాంగ్ డ్రైవ్‌లకు వెళ్ళవచ్చు. కానీ, కారు కొనాలంటే ఖాతాలో డబ్బు కూడా ఉండాలి. ఎందుకంటే ఖరీదైన, లగ్జరీ కార్ల ప్రారంభ ధర రూ.40 నుంచి 50 లక్షలు. ఇలాంటి పరిస్థితుల్లో ఖాతాలో అంత డబ్బు లేని వారు రూ.7 నుంచి 8 లక్షలకు వచ్చే చౌక కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే దీని కోసం కూడా చాలా కుటుంబాలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. మీరు మధ్య తరగతికి చెందిన వారైతే… ఇప్పుడు కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఇది మీకు మంచి అవకాశం. ప్రస్తుతం చాలా బ్యాంకులు కార్ల కొనుగోలుకు రుణాలు ఇస్తున్నాయి.
సాధారణంగా భారతీయ కుటుంబాలు కారు కొనడానికి రూ. 5 లక్షల వరకు రుణం తీసుకుంటాయి. మిగిలిన డౌన్‌పేమెంట్‌ను వారి స్వంత ఖాతానుంచి తీసుకుంటారు. కార్లను కొనుగోలు చేయడానికి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇస్తున్న ఐదు ప్రభుత్వ బ్యాంకుల గురించి తెలుసుకుందాం.
కెనరా బ్యాంక్: మీరు కారు కొనాలని అనుకున్నట్లైతే కెనరా బ్యాంక్ నుండి లోన్ తీసుకోవచ్చు. కెనరా బ్యాంక్ ప్రస్తుతం 8.80 నుండి 11.95 శాతం వడ్డీకి కార్ లోన్‌లను అందిస్తోంది. విశేషమేమిటంటే, మీరు ఎక్కువ EMI చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీని కారణంగా మీ ఇంటి బడ్జెట్ దెబ్బ తినదు. మీరు కారు కొనడానికి కెనరా బ్యాంక్ నుండి రూ. 5 లక్షల వరకు రుణం తీసుకుంటే, మీ నెలవారీ EMI రూ. 10,331 నుండి రూ. 11,110 మధ్య ఉండవచ్చు. అలాగే, కెనరా బ్యాంక్ మీకు రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: మీరు స్టేట్ బ్యాంక్ నుండి 5 లక్షల రూపాయల వరకు కారు రుణం తీసుకుంటే, మీరు 8.65 నుండి 9.70 శాతం వడ్డీ చెల్లించాలి. మీ నెలవారీ EMI రూ. 10,294 నుండి రూ. 10,550 మధ్య ఉంటుంది. అయితే, రుణ మొత్తంలో 0.25 శాతం ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్: మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి కారు రుణం తీసుకుంటే, మీరు 8.75 నుండి 9.60 శాతం వరకు వడ్డీ చెల్లించాలి. మీరు EMIగా ప్రతి నెలా రూ. 10,319 నుండి రూ. 10,525 వరకు చెల్లించాలి. PNB బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజు 0.25 శాతం, ఇది రూ. 1,000 నుండి 1,500 వరకు ఉంటుంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం కార్ లోన్‌పై 8.75 నుండి 10.50 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తోంది. మీ నెలవారీ EMI రూ. 10,319 నుండి రూ. 10,747 మధ్య ఉంటుంది. ఇది కాకుండా, బ్యాంక్ మీకు రూ. 1,000 వరకు ప్రాసెసింగ్ ఛార్జీని వసూలు చేయవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా: మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి కారు రుణం తీసుకుంటే, మీరు 8.70 నుండి 12.20 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలి. అయితే, మీ నెలకు EMI రూ. 10,307 నుండి రూ. 11,173 మధ్య ఉండవచ్చు. ఇది కాకుండా, బ్యాంక్ మీకు ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 1,500 నుండి రూ. 2,000 వరకు వసూలు చేయవచ్చు.