Leading News Portal in Telugu

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్థిరంగా కొనసాగుతున్న ధరలు.. ఈరోజు ఎంతంటే?


పసిడి ప్రియులకు ఈరోజు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మొన్నటివరకు నాలుగు రోజులుగా కిందకు దిగి వచ్చిన బంగారం ధరలు నిన్న కాస్త ఎక్కువగానే పెరిగాయి. ఈరోజు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.ఈరోజు బంగారం ధర నిలకడగానే ఉంది. ఎలాంటి మార్పు లేదు. పసిడి ధర స్థిరంగానే కొనసాగింది. బంగారం ధర నిలకడగా ఉంటే.. వెండి రేటు మాత్రం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం భారీగా కిందకు దిగి వచ్చింది..

ఇకపోతే సెప్టెంబర్ 12, మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54, 840 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,830గా ఉంది. నిన్నటితో పోల్చితే.. ఈ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇక దేశంలోని పలు నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం..

*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54, 990 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59, 990గా ఉంది.
*. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,210గా ఉంది.
*. ఇక ముంబై, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 54, 840 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59, 830గా కొనసాగుతోంది.

ఈరోజు మార్కెట్ లో పసిడి ధరలు తగ్గితే.. వెండి ధరలు మాత్రం కాస్త పెరిగాయి.. ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..కిలో వెండి ధర రూ. 500 పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74, 500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73, 250 ఉండగా.. ముంబైలో రూ. 74, 500గా కొనసాగుతోంది. ఇక చెన్నై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,000గా నమోదు అయ్యింది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి…