Tata Motors: మీరు వాణిజ్య వాహనాలను కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీరు త్వరపడాల్సిన సమయం వచ్చేసింది.. ఎందుకంటే మరో 10 రోజుల్లో వాణిజ్య వాహనాల ధరలను పెరగబోతున్నాయి.. చౌక ధరలకు వాణిజ్య వాహనాలను కొనుగోలు చేసే అవకాశం సెప్టెంబర్ 30వ తేదీ వరకే ఉంటుంది.. ఆ త్వాత కంపెనీ యొక్క ఈ వాహనాలు ఖరీదైనవిగా మారతాయి. వాస్తవానికి, టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలను 3 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెరిగిన ధరలు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. టాటా మోటార్స్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో మొత్తం ఇన్‌పుట్ ఖర్చు అంటే కారు తయారీ ధర పెరుగుదల కారణంగా వాణిజ్య వాహనాల ధరలను సగటున 3 శాతం పెంచాలని కంపెనీ నిర్ణయించినట్లు తెలిపింది. వివిధ మోడల్స్ మరియు వేరియంట్ల ధరలలో ఈ పెరుగుదల ఉంటుందని పేర్కొంది.
అయితే, టాటా మోటార్స్.. ఈ ఏడాదిలోనే నాలుగోసారి తన వాహనాల ధరలను పెంచింది.. జులై 17వ తేదీ నుండి వివిధ మోడల్స్ మరియు వేరియంట్‌ల టాటా మోటార్స్ కార్ల ధరలను కంపెనీ సగటున 0.6 శాతం పెంచింది. అంతకుముందు, ఏప్రిల్ 1 నుండి కంపెనీ వాణిజ్య వాహనాల ధరలను 5 శాతం పెంచింది. అదే ఆ సమయంలో, ఫిబ్రవరిలో , టాటా మోటార్స్ తన అన్ని ICE ప్యాసింజర్ వాహనాల ధరలను సగటున 1.2 శాతం పెంచింది. గత ఫిబ్రవరి 10న టాటా టియాగో.. ఈవీ కారు ధర సుమారు రూ.20 వేలు పెంచేసింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రెండో దశ బీఎస్-6 ప్రమాణాలు అమల్లోకి రావడంతో కార్ల ధరలు పెంచేశారు.. టాటా మోటార్స్.. టియాగో, టైగోర్, ఆల్ట్రోజ్‌తోపాటు ఎస్‌యూవీలు పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ మోడల్ కార్లు విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.5.54 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉన్నాయి.. అయితే వచ్చే నెల 1వ తేదీ నుంచి కమర్షియల్ వాహనాల ధరలను పెంచనున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించిన నేపథ్యంలో.. వాహనాలు కొనుగోలు చేయాలనే చూసేవారికి ఇదే సరైన సమయం అన్నమాట.