బిజినెస్ చెయ్యాలనే కోరికలు అందరికి ఉంటుంది.. కానీ ఎక్కడ లాస్ అవుతామో అని కొందరు భయపడితే, మరికొంతమంది ధైర్యం చేసి నిలబడతారు..అనుకున్న దానికన్నా ఎక్కువగా సక్సెస్ అయ్యి చూపిస్తారు.. మీకు కూడా బిజినెస్ చెయ్యాలనే కోరిక ఉందా? అయితే మీకోసం అదిరిపోయే బిజినెస్ ఐడియాను తీసుకొచ్చాము.. ఆ ఐడియా ఏంటో ఓ లుక్ వేద్దాం పదండీ..
అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించి భారీ లాభాలు ఆర్జించే బిజినెస్‌లు చాలా ఉన్నాయి. ఇలాంటి వాటిలో ధూప్ బట్టీ లేదా ధూపం స్టిక్స్ తయారీ ఒకటి.. వీటిని తయారీ చేసేందుకు కేవలం లక్ష రూపాయలను మాత్రమే పెట్టుబడిని పెట్టాలి.. వీటి వల్ల లాభాలే కానీ, నష్టాలు లేవు.. మరి ఆలస్యం ఎందుకు పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మనదేశంలో ఆధ్యాత్మికతకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పండుగలు, వేడుకలు, పూజలు వంటి శుభకార్యాల్లో ధూపం బట్టీలను కాల్చడం సంప్రదాయం. ఇవి మంచి సువాసనను వెదజల్లుతాయి. ధూప్ చెట్ల సారం నుంచి వీటిని తయారు చేస్తారు. ఆవుపేడ, సుంగంధ ద్రవ్యాలు, నెయ్యి, మూలికలు, ధూప్ ట్రీ ఎక్స్ట్రాక్ట్ మిశ్రమంతో వీటిని రూపొందిస్తారు. ధూపం స్టిక్స్‌కు అన్ని సీజన్లలో డిమాండ్ ఉంటుంది… లాభాలే కానీ ఎక్కడ నష్టాలు వచ్చే అవకాశాలు లేవని చెప్పాలి..
ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నివేదిక ప్రకారం.. ధూపం కర్రలు వివిధ ఆచార వ్యవహారాలు, వేడుకల్లో ప్రాచుర్యం పొందాయి. మార్కెట్లో ధూప్ బట్టీలు పెద్దమొత్తంలో అమ్ముడుపోతున్నాయి. తక్కువ బడ్జెట్ కారణంగా స్థానికంగా అమ్మేవారు తక్కువ పరిమాణంలో వీటిని ప్యాకింగ్ చేస్తారు. మీరు ఇదే రకమైన యూనిట్‌ను ఏర్పాటు చేస్తే మంచి లాభం పొందడానికి అవకాశం ఉంటుంది.. ఈ స్టిక్స్ తయారీ యూనిట్ కోసం రెండువేల చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుంది. సొంత స్థలం లేకపోతే అద్దెకు తీసుకోవచ్చు.
ప్లాంట్ మరియు మెషినరీకి రూ.4.40 లక్షలు అవసరం కావచ్చు. ఫర్నిచర్,ఫిక్స్చర్స్కు రూ.50వేలు, ప్రీ ఆపరేటివ్ ఖర్చులు రూ.44 వేలు, వర్కింగ్ క్యాపిటల్ రూ.7.66 లక్షలు మొత్తం కలిపితే రూ.13 లక్షలు అవసరం అవుతుందని చెబుతున్నారు.. ఈ మిషనరీ కోసం బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు.. లేదా ప్రభుత్వం సాయం కూడా చేస్తుంది.. మార్కెటింగ్ మంచిగా ఉంటే మీరు ఏడాదికి రూ.16 లక్షల వరకు ఆదాయాన్ని పొందవచ్చు..