Leading News Portal in Telugu

PhonePe: ఆపిల్, గూగుల్ యాప్ స్టోర్ లకు ఫోన్ పే చెక్..!


ఆపిల్, గూగుల్‌ ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు మరో కొత్త యాప్‌ స్టోర్‌ మార్కెట్ లోకి రాబోతోంది. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫిన్‌టెక్‌ కంపెనీ ఫోన్‌పే తన మొబైల్ యాప్ స్టోర్‌ను డెవలపర్ల కోపం తీసుకు వస్తుంది. ఇండస్‌ యాప్‌స్టోర్‌ అనే పేరుతో ఈ మొబైల్ యాప్ మార్కెట్ ప్లేస్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగు పెడుతూ.. తమ యాప్‌లను ప్రచురించడానికి ఆండ్రాయిడ్‌ యాప్ డెవలపర్‌లకు వెలకమ్ చెప్పింది. ఈ యాప్‌ స్టోర్‌లో యాప్‌లను ఉంచడానికి కానీ, డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు కానీ ఎటువంటి డబ్బులు వసూలు చేయడం ఉందడని తెలుస్తుంది.

అయితే, ఇండస్ యాప్‌స్టోర్ డెవలపర్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు ఫోన్‌పే వెల్లడించింది. ప్లాట్‌ఫామ్‌లోని యాప్ లిస్టింగ్‌లు తొలి సంవత్సరం ఉచితంగా ఉంటాయని, ఆ తర్వాత నామమాత్రపు వార్షిక రుసుము వసూలు చేయనున్నట్లు పేర్కొంది. ఇండస్‌ యాప్ స్టోర్‌లో డెవలపర్‌లు తమ యాప్‌లను ఇంగ్లిష్ కాకుండా మరో 12 భారతీయ భాషల్లో ఎంచుకోవచ్చని తెలిపింది. అలాగే ఆయా భాషల్లోని తమ యాప్ లిస్టింగ్‌లకు ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు అని తెలిపింది.

ఈ యాప్‌లకు సంబంధించి ఏదైన సమస్య వస్తే.. దాన్ని పరిష్కారించేందుకు గూగుల్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ల లాగే ఇండస్‌ యాప్‌ స్టోర్‌ కూడా భారత్‌ కేంద్రంగా ఈ-మెయిల్ లేదా చాట్‌బాట్ ద్వారా 24×7 వర్క్ చేస్తుంది అని వెల్లడించారు. యాప్‌స్టోర్‌ ప్రారంభానికి సంబంధించిన సమాచారాన్ని తాజాగా ఇండస్‌ యాప్‌స్టోర్‌ తమ వైబ్‌సైట్‌లో ప్రకటించింది. ఇండస్ యాప్‌స్టోర్ యూజర్లకు ఎలా అందుబాటులోకి వస్తుంది అనేది కూడా చూపించింది. అయితే ఈ యాప్‌స్టోర్‌ ఎప్పుడు లాంచ్‌ అవుతుంది అనే దానిపై ప్రస్తుతం ఎటువంటి సమాచారం వెల్లడించ లేదు.