RBI: నిబంధనలను పాటించనుందకు ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ సింద్ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఫెనాల్టీని విధించినట్లు సోమవారం తెలిపింది. ‘లోన్స్ అండ్ అడ్వాన్సెస్-చట్టబద్దమైన ఇతర పరిమితులను ఉల్లంఘించినందుకు, ఇంట్రా- గ్రూప్ లావాదేవీలకు సంబంధించిన గైడ్ లైన్స్ ని పాటించనందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రూ. 1.3 కోట్ల జరిమానా విధించింది.
లోన్స్ అండ్ అవ్వాన్సెస్ పరిమితులు, కేవైసీలతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఇంట్రెస్ట్ రేట్ ఆన్ డిపాజిట్) డైరెక్షన్స్ 2016ని ఉల్లంఘించిందనందుకు ఇండియన్ బ్యాంకుపై రూ. 1.62 కోట్ల ఫైన్ విధించింది. డిపాజిటర్ ఎడ్యుకేషన్ మరియు అవేర్నెస్ ఫండ్ స్కీమ్‌లోని కొన్ని నిబంధనలను పాటించనందుకు పంజాబ్ & సింద్ బ్యాంక్‌పై రూ. 1 కోటి ఫెనాల్టీ విధిస్తున్నట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఎన్‌బిఎఫ్‌సిలలో మోసాలను పర్యవేక్షించడానికి నిర్దేశించిన కొన్ని నిబంధనలను పాటించనందుకు ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌పై ఆర్బిఐ రూ. 8.80 లక్షల జరిమానా విధించింది.