తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందే వ్యాపారాలల్లో పానీపూరి బిజినెస్ ఒకటి.. సాయంత్రం నాలుగు అయితే చాలు జనాలు గుంపు గుంపులుగా బండిని చుట్టు ముడతారు.. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కంటే ఎక్కువగా పానీపూరి బండి వాళ్లు, మ్యాగి బండి వాళ్లు సంపాదిస్తున్నారు.. దీనికి పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు.. ఈ బిజినెస్ తో లక్షలు సంపాదిస్తున్న యువ వ్యాపారి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం..
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన 36 ఏళ్ల మనోజ్ పానీపూరీ అమ్మి లక్షల రూపాయలను సంపాదిస్తున్నాడు. పుత్తూరు తాలూకాలోని దారందకుక్కు మానే గ్రామానికి చెందిన మనోజ్‌ని పానీపూరీ బిజినెస్ చేస్తున్నాడు. ఇతను రుచికరంగా అనేక వెరైటీలలో పానీపూరీలను సిద్ధం చేసి ఫుడ్ లవర్స్ కోసం విక్రయిస్తున్నాడు. మనోజ్ 3 సంవత్సరాల క్రితం తన స్వగ్రామం దరందకుక్కుకు తిరిగి రావడానికి ముందు మంగళూరులో 5 సంవత్సరాలు సిటీ బస్సు డ్రైవర్‌గా పనిచేశాడు. ఇక్కడ ఆటో రిక్షా నడుపుతూ జీవనం సాగించేవాడు. పట్టణం అంతటా ప్రయాణీకులను తీసుకువెళుతున్నప్పుడు, పానీ పూరీ దుకాణాలకు ప్రజలు ఎలా క్యూలు కడుతున్నారో చూసాడు.. దాన్నే బిజినెస్ చెయ్యాలని అనుకున్నాడు..
ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పాడు.. వారి సహాయం కూడా తోడైంది.. మొదటగా చేతులతో తయారీ చేసేవారు.. ఆ తర్వాత మనుషులను పెట్టుకున్నాడు.. మార్కెట్ లో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పూరీ తయారీని ఫుల్ టైమ్ జాబ్‌గా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొంత టెక్నాలజీతో సౌరశక్తితో నడిచే పూరీ తయారీ యంత్రాన్ని కొనుగోలు చేశాడు. యంత్రం ఖరీదు రూ.2.9 లక్షలు. కానీ సోలార్ కావడంతో రూ.70వేలు సబ్సిడీ వచ్చింది. యంత్రాన్ని సెల్కో విక్రయిస్తుంది. అతను తన పెరట్లో ఒక చిన్న పూరీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిరోజూ కనీసం 40 కిలోల పూరీలను తయారు చేసేవాడు.. పలు ప్రాంతాలకు పానీ పూరిలను మార్కెటింగ్ చేస్తూ వస్తున్నాడు.. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు..