బిజినెస్ చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. అతి తక్కువ పెట్టుబడితో అంటే కేవలం పదివేలతో చేసే బిజినెస్ లు ఎన్నో ఉన్నాయి.. అందులో అధిక లాభాలను ఇచ్చే కొన్ని బిజినెస్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
*. వంట చేయడంలో మంచి నైపుణ్యం ఉన్న వారు అయితే, యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించవచ్చు. రుచికరమైన వంటకాలను ప్రపంచంతో పంచుకోవచ్చు. వంట ప్రాసెస్‌ను వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయవచ్చు.. ఈ వీడియో ను మంచిగా ప్రమోట్ చేస్తే మంచిగా రెవిన్యూ ను సంపాదించవచ్చు..
*. ఈ మధ్య జనాలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఫిట్‌నెస్ కోసం ఖర్చు చేయడానికి ముందుకొస్తున్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా, చాలామంది జిమ్‌కు వెళ్లలేకపోతున్నారు. అందువల్ల ఆన్‌లైన్ ఫిట్‌నెస్ ట్రైనర్‌లకు డిమాండ్ పెరిగింది. ఫిట్‌నెస్‌లో నాలెడ్జ్, స్కిల్స్ ఉంటే ఆన్‌లైన్ ఫిట్‌నెస్ ట్రైనర్‌గా మారవచ్చు.. తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్ ను ప్రారంభించవచ్చు..
*. టిఫిన్ సర్వీసు బెస్ట్ బిజినెస్ ఆప్షన్. ఇంట్లో తయారుచేసిన భోజనాలకు డిమాండ్ భారీగా ఉంటుంది. ఆరోగ్యకరమైన టిఫిన్ సర్వీసుల కోసం ప్రజలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వ్యాపారానికి ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ అవసరం లేదు. ఇప్పటికే అందుబాటులో ఉన్న పదార్థాలతో సొంతంగా బిజినెస్ ను ప్రారంభించవచ్చు..
*. ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి మార్గాలను అన్వేషిస్తున్నారు. యోగా పాపులర్ అవుతోంది. ఇంట్లో లేదా కమ్యూనిటీ సెంటర్‌లో యోగా ఆసనాలను టీచ్ చేయడం ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారానికి అధిక డిమాండ్ ఉంది.. అతి తక్కువ ఖర్చుతో దీన్ని ప్రారంభించవచ్చు..
*. మన తెలుగోళ్లు పచ్చళ్ళు లేనిదే ముద్ద దిగదు.. ఈరోజుల్లో టైం ఉండటం లేదు.. చాలా కుటుంబాలకు ఇంట్లో పచ్చళ్లను తయారు చేయడం కష్టమైన పని. కాబట్టి రూ.10,000 తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టవచ్చు. కావలసిందల్లా తాజా ముడి పదార్థాలు, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా తయారు చేసే పద్ధతి, కొన్ని ప్యాకేజింగ్ పదార్థాలు. వ్యాపారం పెరుగుతున్న కొద్దీ సమర్థవంతమైన మార్కెటింగ్ ను నెమ్మదిగా పెంచుకోవచ్చు.. పూల వ్యాపారం కూడా మంచి వ్యాపారం.. ఇలా చిన్న వాటితోనే మంచి లాభాలను పొందవచ్చు..