
Amazon: కోవిడ్ మహమ్మారి సమయంలో పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్(WFH) సదుపాయాన్ని కల్పించాయి. ముఖ్యంగా టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి దగ్గర నుంచే పనిచేయాల్సిందిగా కోరాయి. అయితే కరోనా ప్రభావం తగ్గి దాదాపుగా రెండేళ్లు అవుతోంది. ఈ క్రమంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని ఎత్తేస్తున్నాయి. కొన్ని కంపెనీలు హైబ్రీడ్ మోడ్ లో వారానికి మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని కోరితే, మరికొన్ని కంపెనీలు అన్ని రోజులు ఆఫీసు నుంచే పనిచేయాలని ఆదేశిస్తున్నాయి.
Read Also: Israel-Hamas War: డ్రగ్స్ మత్తులో హమాస్ ఉగ్రవాదుల అరాచకం.. ఇజ్రాయిల్‌పై దాడిలో కొత్త విషయాలు..
అయితే వర్క్ ఫ్రం హోం విధానానికి అలవాటు పడిన ఉద్యోగులు ఆఫీసులకు వచ్చేందుకు ససేమిరా అంటున్నారు. అయితే అలాంటి ఉద్యోగులను తొలగించేందుకు కూడా టెక్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. తాజాగా అమెజాన్ తన ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీసుకు హాజరుకావాలని కఠినంగా చెబుతోంది. నిబంధనలను పాటించని పక్షంలో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని గట్టిగా చెప్పింది. అమెజాన్ సంస్థ రిటర్న్-టూ-ఆఫీస్ విధానంతో ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది.
ఎవరైనా వారానికి మూడు సార్లు ఆఫీసుకు రావడంతో విఫలమైతే, వారిని తొలగించడానికి కూడా వెనకాడటం లేదు. ఇలా తొలగించే బాధ్యతలను మేనేజర్లకు అప్పగించింది. ఇన్‌సైడర్ ప్రకారం.. అమెజాన్ రిటర్న్-టు-ఆఫీస్ పాలసీకి సంబంధించి తన గ్లోబల్ మేనేజర్ మార్గదర్శకత్వాన్ని అప్‌డేట్ చేసింది. వారానికి మూడు రోజులు ఆఫీసు నుంచే పని విధానానికి కట్టుబడి ఉండాలని, లేకుంటే అలాంటి ఉద్యోగులను తొలగించే అధికారాన్ని మేనేజర్లకు అప్పటించింది. అయితే ఉద్యోగులను వెంటనే తొలగించడం కాకుండా.. మూడు దశల్లో ఈ ప్రక్రియను అమలు చేయనున్నారు.