
ప్రముఖ దిగ్గజ సంస్థ రిలయన్స్.. తన జియో ఫోన్ ప్రైమ్ 4Gని విడుదల చేసింది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023లో ఆ ఫోన్ను ఆవిష్కరించారు. ఇక.. ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. రూ. 2,599 ఉంది. ఈ ఫోన్ దీపావళి నాటికి అమ్మకానికి అందుబాటులో రానుంది. జియో ఫోన్ ప్రైమా 4G ఫోన్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
స్పెసిఫికేషన్లు
Jio ఫోన్ 320×240 పిక్సెల్ రిజల్యూషన్‌తో 2.4 అంగుళాల TFT డిస్‌ప్లే, 0.3MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో వాట్సప్, యూట్యూబ్, ఫేస్ బుక్ చూడొచ్చు. అంతేకాకుండా.. జియో సినిమా, జియో సావన్, జియో టీవీ, జియో, యూపీఏ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ లో బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, FM రేడియో సదుపాయం ఉంది.
ఫీచర్లు
Jio ఫోన్ ARM Cortex A53 చిప్‌సెట్‌తో నడుస్తుంది. ఇది 512MB RAM, 128GB వరకు స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. జియో Prima 4G ఫోన్ KaiOSలో నడుస్తుంది. అంతేకాకుండా.. 1800mAh శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంది.