Leading News Portal in Telugu

Gas Price Hike: సామాన్యులకు భారీ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు…ఎంతంటే?


Gas Price Hike: సామాన్యులకు భారీ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు…ఎంతంటే?

ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు కొన్నిటి ధరలు తగ్గడమో లేక పెరగడమో జరుగుతుంది.. గత నెలతో పోలిస్తే.. ఈ నెల ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. .చమురు కంపెనీలు వాణిజ్య సిలిండర్లను భారీగా పెంచేశాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను రూ.101.50 పెంచాయి. ఇది సామాన్యులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల యొక్క ఈ కొత్త రేట్లు ఈ రోజు నుండి అంటే నవంబర్ 1, 2023 నుండి అమలులోకి వచ్చాయి. కొత్త రేటు అమలు తర్వాత, రాజధాని ఢిల్లీలో ఇప్పుడు LPG యొక్క వాణిజ్య సిలిండర్ 1833 రూపాయలకు చేరుకుంది..

ఇక దేశ వ్యాప్తంగా సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పులు కనిపించలేదు.. మిగిలిన నగరాల్లో సిలిండర్ ధరలను చూస్తే.. ఢిల్లీలో డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.903, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో 14 కిలోల సిలిండర్ ధర రూ.929. మహారాష్ట్రలోని ముంబైలో గృహోపకరణాల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.902.5. చెన్నైలో కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రూ.918.5కు లభిస్తున్నాయి..

గత అక్టోబర్ 1 నుంచి 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర రూ.209 పెరిగింది. అక్టోబర్‌లో కొత్త రేట్లు అమలులోకి వచ్చిన తర్వాత, ఢిల్లీలో వాణిజ్య LPG సిలిండర్ రిటైల్ అమ్మకపు ధర రూ. 1731.50గా ఉంది. ఇది నవంబర్‌లో పెరిగిన రేటు తర్వాత ఇప్పుడు రూ. 1833గా మారింది.. ఇక అంతకు ముందు సెప్టెంబర్ లో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ. 157 తగ్గించాయి, ఆ తర్వాత ఈ సిలిండర్ ఢిల్లీలో రూ. 1522.50 కోల్‌కతాలో రూ. 1636కు అందుబాటులోకి వచ్చింది.. ఇక డిసెంబర్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..