
IKEA Fined: ప్రస్తుతం ఎక్కడ చూసినా షాపింగ్‌మాల్స్, సూపర్ మార్కెట్లు దర్శనమిస్తున్నాయి. సూపర్‌మార్కెట్లలో షాపింగ్ చేసిన వారికి ఆ మాల్ వారే క్యారీ బ్యాగ్‌లు ఇస్తారు. దానికి కూడా మనం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొన్ని మాల్స్‌లో క్యారీబ్యాగ్‌లకు వాటి లోగోలు ఉంటాయి. లోగోలు ఉన్న క్యారీ బ్యాగ్‌లకు మనం డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే, బెంగుళూరులోని ఐకియా మాల్‌లోని క్యారీబ్యాగ్‌లకు లోగోలు ఉన్నాయి. అయినా సరే, వినియోదారుల నుంచి ఆ మాల్ సిబ్బంది డబ్బులు వసూలు చేశారు. ఈ విషయంపై ఓ మహిళ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. దీంతో ఆ మాల్‌పై 20 రూపాయల క్యారీ బ్యాగ్ కోసం రూ.3వేల జరిమానాను విధించింది వినియోగదారుల కోర్టు.
బెంగుళూరుకు చెందిన సంగీత బోహ్ర అనే మహిళ అక్టోబర్ 6న ఐకియా మాల్‌లో షాపింగ్ చేసింది. ఆ షాపింగ్‌లో సంగీత 2 వేల 428 రూపాయల విలువైన వస్తువులను కొనుగోలు చేశారు. అయితే, ఈ మాల్‌లో షాపింగ్ చేసేవారు ఇంటినుంచి బ్యాగ్‌లను తెచ్చుకోకూడదు. అందుకోసం ఆమెకు ఓ క్యారీ బ్యాగ్ అవసరమైంది. అయితే అక్కడ వున్న సిబ్బందిని సంగీత క్యారీ బ్యాగ్‌ను అడిగారు. అయితే ఐకియా లోగో ఉన్న క్యారీ బ్యాగ్‌ను ఇచ్చి ఆమె నుంచి అక్కడి సిబ్బంది 20 రూపాయలను వసూలు చేశారు. కంపెనీ లోగో వున్న బ్యాగ్‌లకు కూడా డబ్బులు ఎలా వసూలు చేస్తారంటూ సిబ్బందిపై వాదనకు దిగారు సంగీత. అయినా అక్కడి యాజమాన్యం ఏమాత్రం దాని గురించి పట్టించుకోలేదు. దాంతో ఆ మహిళ స్టారో లోగో ఉన్న బ్యాగ్‌కు 20 రూపాయలు ఎలా వసూలు చేస్తారంటూ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఆ బ్యాగ్‌కు ఛార్జీ వసూలు చేసినందుకు పరిహారంగా మూడువేల రూపాయలు చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయించింది ఆ మహిళ.20 రూపాయల కవర్‌కు వడ్డీతో కలిపి నష్టపరిహారంగా వెయ్యిరూపాయలు, న్యాయపరమైన ఖర్చులకు రెండువేల రూపాయలు చెల్లించాలంటూ వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టు ఐకియా మాల్‌కు జరిమానా విధించింది. ఇచ్చిన తీర్పు ప్రకారం జరిమానా విధించిన 30 రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు స్పష్టం చేసింది.