Leading News Portal in Telugu

Atal Pension Yojana : సూపర్ స్కీమ్.. రోజుకు కేవలం రూ.7 పెడితే, నెలకు రూ.5000 పెన్షన్..



Pension

కేంద్ర ప్రభుత్వం ఎన్నో అద్భుతమైన పథకాలను అమలు చేస్తుంది.. అందులో కొన్ని పథకాలు మాత్రం జనాలకు మంచి లాభాలాను ఇస్తున్నాయి.. అందులో అటల్ పెన్షన్ స్కీమ్ కూడా ఒకటి.. గతంలో ఈ స్కీమ్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం.. ఈ పెన్షన్ యోజనలో చేరాలంటే 40 ఏళ్లలోపు భారతీయ పౌరులై ఉండాలి. బ్యాంకు ఖాతా అవసరం ఉంటుంది. రోజు ఒక కప్పు టీ కంటే తక్కువ పెట్టుబడి పెట్టి ప్రతినెల రూ.5,000 పెన్షన్‌ పొందే అవకాశం ఉంది. ఈ స్కీమ్ చేరాలని అనుకొనేవారు.. మీరు 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే కేవలం రోజుకు రూ.7 అంటే నెలకు రూ.210 వెచ్చిస్తే సరిపోతుంది.

60 ఏళ్ల వయసు దాటిన త​ర్వాత రూ.5వేలు పెన్షన్‌ పొందొచ్చు… ఇరవైఐదో సంవత్సంలో ఈ పెన్షన్‌ను ప్రారంభిస్తే నెలకు కొంత ఎక్కువగా రూ.367 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 30వ ఏటా ఇన్వెస్ట్ చేయాలంటే నెలకు రూ. 577 ను చేస్తే సరిపోతుంది.. ఇక చివరిగా ఎవరైనా వ్యక్తి తన 40 ఏళ్ల వయస్సులో స్కీమ్ లో ఇన్వెస్ట్ ప్రారంభించాలంటే అందుకోసం నెలకు రూ.1454 పెట్టుబడిగా పెట్టాలి. దాంతో మీ వయసు 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతినెల పెన్షన్‌ పొందే అవకాశం ఉంది.

నెలవారీ, మూడు నెలలు, ఆరునెలలు, ఏడాది వారీగా ఈ నగదును చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు.. యుక్తవయస్సులోనే అంటే 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్నవాళ్లు ఇన్వెస్ట్ చెయ్యడం మంచిది. నెలవారీ ఈ పథకాన్ని ప్రారంభిస్తే తక్కువ రూఖర్చుతోనే.5వేలు పెన్షన్‌ పొందొచ్చు. ఈ పెన్షన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2016 లో ప్రారంభించింది.. ఇప్పటికి ఎంతో మంది ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు.. ఇంకా ఎన్నో స్కీమ్ లను కూడా ప్రభుత్వం అందిస్తుంది..