Leading News Portal in Telugu

Subrata Roy: సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ కన్నుమూత..



Roy

సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్(75) గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు.. ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్సను తీసుకుంటున్నారు.. సమస్య ఎక్కువ కావడంతో వైద్యానికి సహకరించలేదు.. దాంతో ఆయన తుది శ్వాస విడిచారు.. ఈయన 1948లో బీహార్‌లోని అరారియాలో ఆయన జన్మించారు, సహారా ఇండియా పరివార్‌ను ప్రారంభించిన సుబ్రతా రాయ్ విజయగాథ 1978లో ప్రారంభమైంది. కేవలం రూ. 2,000 తో వ్యాపారాన్ని ప్రారంభించి,సహారా ఇండియా వ్యాపరం 2000లో గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ సయమంలో ఒక రిపోర్టులో భారతీయ రైల్వే తర్వాత దేశంలో రెండవ అతిపెద్ద ఉపాధి సంస్థగా అభివర్ణించారు.

ఈయన మెటాస్టాటిక్ ప్రాణాంతకత, రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలతో సుదీర్ఘ పోరాటంలో కార్డియోస్పిరేటరీ అరెస్ట్‌తో సుబ్రతా రాయ్ మరణించారని సహారా బుధవారం ప్రకటనలో పేర్కొంది. ఆదివారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. ఇక అప్పటి నుంచి చికిత్స ను పొందుతూన్నారు.. ఆరోగ్యం విష మించడంతో తుది శ్వాస విడిచారు..

ఇక సహార ఇండియా కూడా ఐపీఎల్ పుణే వారియర్స్ ఇండియా పేరుతో ఒక జట్టును కొనుగోలు చేసింది. తర్వాత బీసీసీఐ తో విభేదాల కారణంగా ఈ ప్రాంచైజీని రద్దుచేసుకుంది.. ఇదొక్కటే కాదు.. గ్రో స్వెనర్ హౌజ్ ఎంబీ వ్యాలీసిటీ ప్లాజా హోటల్, డ్రీమ్ డౌన్ టౌన్ హోటల్స్ కు యజమాని. సుబ్రతారాయ్ మరణం పట్ల సమాజ్ వాదీ పార్టీ ట్వీట్ ద్వారా సంతాపం ప్రకటించింది. సహరాశ్రీ సుబ్రతారాయ్ జీ మరణం భాధాకరం.. ఆయన ఆత్మకు చేకూరాలని ప్రార్థిస్తూ ట్వీట్ చేశారు…