
Bank Strike: వచ్చే నెలలో వివిధ బ్యాంకుల్లో సమ్మె జరగనున్నందున డిసెంబరులో బ్యాంకులు చాలా రోజులు మూసివేయబడవచ్చు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) ఈ విషయంపై నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని ఇచ్చింది. AIBEA డిసెంబరు 2023లో వేర్వేరు తేదీల్లో బ్యాంకుల్లో సమ్మెను ప్రకటించింది. ఈ సమ్మె డిసెంబర్ 4 నుండి డిసెంబర్ 11 జరుగనుంది. బ్యాంకుల్లో ఏయే రోజుల్లో పనులకు అంతరాయం కలుగుతుందో తెలుసుకోండి.
డిసెంబర్ 2023లో ఈ రోజుల్లో బ్యాంకుల సమ్మె ఉంటుంది
డిసెంబర్ 4, 2023- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
డిసెంబర్ 5, 2023- బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా
డిసెంబర్ 6, 2023- కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డిసెంబర్ 7, 2023- ఇండియన్ బ్యాంక్, UCO బ్యాంక్
డిసెంబర్ 8, 2023- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
డిసెంబర్ 9 మరియు 10, 2023- బ్యాంకులకు శనివారం, ఆదివారం వారపు సెలవు.
డిసెంబర్ 11, 2023- ప్రైవేట్ బ్యాంకుల్లో సమ్మె ఉంటుంది.
బ్యాంకు ఉద్యోగుల డిమాండ్ ఏమిటి?
బ్యాంకు ఉద్యోగుల ఈ సమ్మె వెనుక ప్రధాన కారణం బ్యాంకులో సరిపడా సిబ్బందిని కోరడమే. దీనితో పాటు బ్యాంకింగ్ రంగంలో ఔట్ సోర్సింగ్‌ను నిషేధించడం ద్వారా శాశ్వత ఉద్యోగాల సంఖ్యను పెంచడం వంటి డిమాండ్లు కూడా ఉన్నాయి. ఈ విషయంపై ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా బ్యాంకుల్లో దిగువ స్థాయిలో ఔట్సోర్సింగ్ చేసే వారి సంఖ్య పెరిగిందన్నారు. తాత్కాలిక ఉద్యోగుల పెరుగుదల కారణం వినియోగదారుల వ్యక్తిగత సమాచారం కూడా ప్రమాదంలో ఉంది.