Leading News Portal in Telugu

L&T Technology: L&T టెక్నాలజీ సర్వీసెస్‌ ఉద్యోగులకు షాక్.. 200 మందికి లేఆఫ్..



L&t Technology Services

L&T Technology Services: L&T టెక్నాలజీ సర్వీసెస్‌ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. మధ్యస్థాయి నుంచి సీనియర్ రోల్స్‌లో ఉన్న 200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు రిపోర్ట్స్ వెలువడ్డాయి. ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ పెర్ఫామెన్స్ సైకిల్, ఉద్యోగుల ఓవర్ లాప్ కారణంగా పాక్షికంగా తన సిబ్బందిని తొలగించనుంది.

L&T టెక్నాలజీ దాదాపుగా 24,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ప్రస్తుతం 200 మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న కంపెనీ, ఆ తర్వాత వ్యాపార వాతావరణాన్ని అంచానా వేసి జనవరిలో మరో రౌండ్ ఉద్యోగుల కోత ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ‘‘ మేము ప్రతీ ఏడాది మా శ్రామిక శక్తి సామర్థ్యాలను అంచనా వేయడానికి, నైపుణ్యం, పనితీరు ఆధారంగా తగిన విధంగా వ్యవహరించడానికి ఒక ప్రామాణిక వార్షిక పనితీరు సమీక్షిస్తాము. మా ఉన్నత ప్రమాణాల సేవల్ని, స్కిల్స్‌ని పెంచుకోవడం సంస్థకు కీలకం. సంస్థ, మేము సాంకేతిక ఆవిష్కరణల్లో ముందంజలో ఉన్నామని నిర్థారిస్తూ.. మా వృద్ధి అవకాశాలకు, వ్యూహాలకు అనుగుణంగా ప్లాంట్ ఇంజనీరింగ్, డిజిటల్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, ఏఐ విభాగాల్లో నియామకాలను జోడిస్తాం.’’ అని L&T ప్రతినిధి చెప్పారు.

Read Also: CPI Narayana: కూతురును కాపాడుకునేందుకు కేసీఆర్ బీజేపీతో కలిశాడు

గత నెలలో L&T టెక్నాలజీ సర్వీసెస్ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను తగ్గించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 5 శాతం పెరిగి రూ. 315.4 కోట్లకు చేరుకుంది. అయితే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధిని తగ్గించింది.

గతేడాదిగా పలు కంపెనీల్లో మొదలైన లేఆఫ్స్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెక్ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగుల్ని తొలగించాయి. ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక మందగమనానికి తోడు ఏఐ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉద్యోగులకు కోతలు విధించాయి.