Corporate Sector Loan: కార్పొరేట్ రంగానికి బ్యాంకు రుణాలలో 14.9% వృద్ధి.. పెరిగిన టర్మ్ డిపాజిట్ల వాటా
ప్రైవేట్ కార్పొరేట్ రంగానికి బ్యాంకులు ఇచ్చిన రుణాలు సెప్టెంబర్‌లో 14.9 శాతం పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తెలిపింది. బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన డేటాను విడుదల చేస్తూ సెంట్రల్ బ్యాంక్ ఈ సమాచారాన్ని ఇచ్చింది. ఈ గణాంకాల ప్రకారం.. 6-8 శాతం వడ్డీ రేటుతో టర్మ్ డిపాజిట్ల వాటా మార్చి 2022లో 12.5 శాతంతో పోలిస్తే సెప్టెంబర్ 2023లో 78.6 శాతానికి పెరిగింది.
Shirdi Sai Baba Temple: షిర్డీ సాయిబాబా భక్తులకు గుడ్‌న్యూస్ చేప్పిన ట్రస్ట్ బోర్డు
RBI డేటా ప్రకారం.. సెప్టెంబర్ చివరి నాటికి పరిశ్రమలకు బ్యాంకు రుణాలు 25 శాతం ఇచ్చింది. దీంతో పరిశ్రమలకు ఇచ్చే బ్యాంకు రుణాలు సెప్టెంబర్‌లో వార్షిక ప్రాతిపదికన 8.6 శాతం పెరిగాయి. సెప్టెంబర్ 2022లో దీని వృద్ధి రేటు 12.3 శాతంగా ఉంది. సెప్టెంబరులో ప్రైవేట్ కార్పొరేట్ రంగానికి బ్యాంకు రుణాలలో మంచి వృద్ధి నమోదైందని.. అది 14.9 శాతానికి పెరిగిందని ఆర్‌బిఐ తెలిపింది. ఇది త్రైమాసికంలో 11.5 శాతం కాగా, ఏడాది క్రితం 14.7 శాతంగా ఉందని తెలిపింది.
Earthquak: ఫిలిఫ్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
బ్యాంకు రుణాల్లో వ్యక్తిగత రుణాల వాటా ఐదేళ్ల క్రితం 22 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది. మొత్తం బ్యాంకు రుణాలతో పాటు వ్యక్తులకు ఇచ్చే రుణాల్లో మహిళా రుణగ్రహీతల వాటా కూడా పెరుగుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకులు ఇచ్చే రుణాల వృద్ధి వేగంగా కనిపిస్తోంది. సెప్టెంబరు నెలాఖరున బ్యాంకుల్లో డిపాజిట్లపై విడుదల చేసిన డేటా పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా.. అధిక రాబడితో డిపాజిట్ల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు చూపిస్తుంది. అధిక రాబడుల కారణంగానే టర్మ్ డిపాజిట్లు పెరిగాయని ఆర్బీఐ పేర్కొంది. మొత్తం డిపాజిట్లలో టర్మ్ డిపాజిట్ల వాటా సెప్టెంబర్ 2023లో సుమారు 60 శాతానికి పెరిగింది. అంతకుముందు మార్చిలో 57 శాతం ఉండేది.