
మనిషికి డబ్బు మీద ఆశ ఎక్కువగానే ఉంటుంది.. అందుకే ఉన్నదాంతో సంతృప్తి పొందడు.. డబ్బులు సంపాదించాలనే కోరికలు ఎక్కువగానే ఉంటాయి.. అందుకే కొత్త కొత్త బిజినెస్ లు చెయ్యాలని అనుకుంటారు.. అలాంటి వారికి ఎటువంటి రిస్క్ లేని అదిరిపోయే బిజినెస్ ఐడియా ఒకటి ఉంది.. అదేంటో ఒకసారి చూద్దాం పదండీ..
ఈ మధ్యకాలంలో ఉద్యోగాలని కూడా కాదనుకొని చాలా మంది వ్యాపారాలపై దృష్టి పెడుతున్నారు. అయితే మీరు కూడా ఏదైనా బిజినెస్ ని మొదలు పెట్టాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ ఫ్రెంఛైజీ తీసుకోవచ్చు… మీరు ఉన్న ఊరిలోనే మంచిగా డబ్బులను సంపాదించుకోవచ్చు.. తక్కువ పెట్టుబడి తోనే ఎక్కువ రాబడిని పొందడానికి అవుతుంది అది కూడా మీరు ఉండే చోటే. ఇలా ఈజీగా మీరు ఈ బిజినెస్ ని మొదలు పెట్టొచ్చు. ఇక పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ ద్వారా మీరు ఎలాంటి సేవలు అందించాలి ఎలా ఫ్రాంచైజీ తీసుకోవాలో ఒకసారి చూద్దాం..
ఈ ఫ్రాంఛైజీలో కేవలం స్టాంప్స్, ఇతర స్టేషనరీ వస్తువులను అమ్మడానికి అవుతుంది. అలానే రిజిస్టర్డ్ ఆర్టికల్స్, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్, మనీ ఆర్డర్ సర్వీస్‌లను బుక్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. బిల్లులు, టాక్స్, జరిమానాలు చెల్లింపు సర్వీసులు ఇవ్వాల్సి వుంది.. కొన్ని పథకాలను జనాలకు అందించాలి.. ఇకపోతే ఇన్సూరెన్స్ సేవలను కూడా మీరు అందించాల్సి వస్తుంది.. ఈ ప్రాంచైజీని తీసుకోవడానికి 18 వయస్సు తప్పనిసరిగా ఉండాలి.. అలానే అగ్రీమెంట్ మీద సంతకం చేసి దీన్ని పొందాల్సి వుంది. కనీసం 8వ తరగతి అయినా ప్యాస్ అయినవాళ్లే అర్హులు. మీకు సుమారుగా లక్ష నుంచి 1.50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. రూ.5000 నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కింద పే చెయ్యాలి కూడా. మీరు అప్లికేషన్ ని సబ్మిట్ చేసి ఫ్రాంచైజీ పొందొచ్చు… అయితే ఈ ప్రాసెస్ అయిన 14 రోజుల్లోనే మీరు అర్హులా కాదా అనేది చెబుతున్నారు.. ఇందులో రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్, మనీ ఆర్డర్ కి మీకు రెండు రూపాయిలు వస్తాయి. ఎక్కువ సేవలని అందిస్తే అదనంగా 20 శాతం కమీషన్ ను పొందవచ్చు..