
Chennai IT firm head gifts brand new cars to 50 employees to express gratitude: పండుగల సందర్భాల్లో కంపెనీలు ఒకట్రెండు నెలల జీతం బోనస్‌గా ఇస్తేనే ఆ ఉద్యోగులు ఎంతగానో సంబరపడతారు. మరి అలాంటింది ఊహించని గిఫ్ట్ వస్తే.. ఆ ఉద్యోగులు ఎగిరి గెంతేస్తారు కదా! ప్రస్తుతం అలాంటి మధురానుభూతినే ఎంజాయ్ చేస్తున్నారు చెన్నైలో ఓ ఐటీ కంపెనీలో పని చేసే కొందరు ఉద్యోగులు. ఐడియాస్2ఐటీ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత మురళి తన 50 మంది ఉద్యోగులకు వివిధ రకాల సరికొత్త కార్లను బహుమతిగా ఇచ్చారు.
చెన్నైకి చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సంస్థ అధిపతి తన 50 మంది ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపేందుకు వివిధ రకాల బ్రాండ్-న్యూ కార్లను బహుమతిగా ఇచ్చారు. ఐడియాస్2ఐటీ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత మురళి తన భార్యతో కలిసి 2009లో సంస్థను స్థాపించారు. వెంచర్‌ను ప్రారంభించినప్పటి నుంచి కొంతమంది ఉద్యోగులు తనకు అండగా నిలబడ్డారని, వారి మద్దతు కోసం వారికి తిరిగి చెల్లించాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. “నేను, నా సతీమణిఅన్ని షేర్లను కలిగి ఉన్నాము. మేము ఇప్పుడు షేర్లను మార్చాలని నిర్ణయించుకున్నాము. 33 శాతం షేర్లను మొదటి నుంచి కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు అందజేస్తాము. మేము సంపద భాగస్వామ్య కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాము. దీని ద్వారా మా ఉద్యోగులకు 50 కార్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము” అని మురళి చెప్పారు. ఉద్యోగుల కష్టానికి తగిన ప్రతిఫలం చెల్లించేందుకు కంపెనీ గతేడాది 100 కార్లను బహుమతిగా ఇచ్చిందని తెలిపారు.