
GST Collection : బడ్జెట్‌కు ఒక్కరోజు ముందు కేంద్ర ప్రభుత్వానికి ఓ శుభవార్త అందింది. జనవరిలో దేశంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.70 లక్షల కోట్లు దాటడం ఇది మూడో నెల. జనవరిలో జీఎస్టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 10.4 శాతం పెరిగినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఒక నెలలో ఇప్పటివరకు ఇది రెండవ అతిపెద్ద కలెక్షన్.
10 నెలల్లో జీఎస్టీ మొత్తం రూ.16.69 లక్షల కోట్లు
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం, జనవరి 31 సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వం రూ. 1,72,129 కోట్ల జీఎస్టీ వసూళ్లను పొందింది. జనవరి 2023లో ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయం రూ.1,55,922 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 2023 – జనవరి 2024 మధ్య వార్షిక ప్రాతిపదికన మొత్తం GST వసూళ్లు 11.6 శాతం పెరిగింది. ఈ 10 నెలల్లో జీఎస్టీ వసూళ్లు ఏడాది క్రితం రూ.14.96 లక్షల కోట్ల నుంచి రూ.16.69 లక్షల కోట్లకు పెరిగాయి. జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లకు పైగా రావడం ఇది 12వ నెల.
ఏప్రిల్ 2023లో అత్యధిక GST
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. 2023 ఏప్రిల్‌లో ఇప్పటివరకు అత్యధిక జీఎస్‌టీ వసూళ్లు రూ.1.87 లక్షల కోట్లు. జనవరిలో రూ.39476 కోట్ల ఎస్‌జిఎస్‌టి, రూ.89989 కోట్ల ఐజిఎస్‌టి, రూ.10701 కోట్ల సెస్సులు వసూలయ్యాయి. బడ్జెట్‌కు ముందు వచ్చిన ఈ గణాంకాలు ప్రభుత్వానికి శుభవార్త లాంటివి. జీఎస్టీ విధానాన్ని ప్రభుత్వం నిరంతరం మెరుగుపరుస్తోంది. దీనితో పాటు ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం, పండుగల సీజన్‌లో అధిక వ్యయం, జీఎస్‌టీలో ప్రభుత్వం చేసిన సంస్కరణలు వసూళ్లు పెరగడానికి ప్రధానంగా కారణమవుతున్నాయి.
జీఎస్టీ వసూళ్లు చాలా ముఖ్యం
GST వసూళ్లు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు. GST నుండి వచ్చిన డబ్బును ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలలో ఉపయోగిస్తారు. ఇది ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు సంకేతం. జీఎస్టీ వసూళ్లు పెరగడం వల్ల ప్రజలు ఎక్కువ ఖర్చు చేస్తున్నారన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది.