
ప్రముఖ బీమా ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ.. ప్రజలకు అధిక రాబడి ఇచ్చే పెన్షన్ పథకాలను అందిస్తుంది. పెన్షన్ పథకాలకు డిమాండ్ పెరుగుతోంది. అంటే ఒకేసారి పెట్టుబడి పెట్టి.. నెలవారీ లేదా.. వార్షిక పెన్షన్ పొందాలనుకునే పథకాల కోసం ఎక్కువ మంది వెతుకుతున్నారు.. ఇందులో కూడా అదిరిపోయే ప్లాన్ ఒకటి ఉంది.. ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్.. ఈ పాలసీ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ పాలసీ విక్రయాలు 2024, ఫిబ్రవరి 6వ తేదీ నుంచే మొదలు అయ్యాయి.. ఈ రోజు నుంచే ఈ పాలసీ అందుబాటులోకి వచ్చింది.. యూనిట్ లింక్డ్ పాలసీల ద్వారా లైఫ్ కవర్ తో పాటు గా మీరు మీ దీర్ఘకాలికి లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు పెట్టుబడులు పెడుతుంది సంస్థ. ఒకే పాలసీ తో డబుల్ బెనిఫిట్స్ ని పొందవచ్చు. ఎల్ఐసీ ఇండెక్స్ ఫండ్ ప్లాన్ అనేది ఒక యూనిట్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యూవల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఫిబ్రవరి 6వ తేదీన లాంఛ్ చేస్తున్నారు.. ఈ పాలసీ అనేది ఈ దేశంలో ఉండే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది..
ఈ పాలసీని తీసుకొనేవారికి కనీసం కనీసం 90 రోజుల నుంచి 50 లేదా 60 ఏళ్ల వయసు వరకు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. కనీస మెచ్యూరిటీ వయసు 18 ఏళ్లు. గరిష్ఠ మెచ్యూరిటీ వయసు 75 లేదా 85గా ఉంది. కనీస ప్రీమియం రేంజ్ ఏడాదికి రూ.30 వేలు. 5 ఏళ్ల లాకిన్ పీరియడ్ తర్వాత పెట్టుబడి పెట్టిన యూనిట్స్ లో మీకు కావలసిన అమౌంట్ ను డ్రా చేసుకోవచ్చు.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు..