Leading News Portal in Telugu

Onions : 24గంటల్లోనే మార్కెట్లో రూ.150తగ్గిన ఉల్లి ధర



Onion

Onions : పెరుగుతున్న ద్రవ్యోల్బణం సామాన్యుల ఇంటి బడ్జెట్ ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఓ వైపు వెల్లుల్లి రేటు రోజు రోజుకు కొండెక్కుతుంటే.. మరో వైపు నేనేం తక్కువ అంటూ కొండపైకి చూస్తోంది. ఇటీవల కాలంలో ఉల్లి ధరలో స్వల్ప పెరుగుదల నమోదైంది. దీంతో సామాన్యులు మళ్లీ ధరలు పెరుగుతాయేమో అని భయపడ్డారు. అయితే ఇప్పుడు వారికి గొప్ప ఉపశమనం లభించింది. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్‌లో కేవలం 24 గంటల్లోనే ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.150 తగ్గింది. ఉల్లి ఎగుమతిపై నిషేధాన్ని తొలగిస్తున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. దాని కారణంగా ఉల్లి ధరలు పెరిగాయి. అయితే, మంగళవారం మధ్యాహ్నం వరకు దాని ధరలు తగ్గడం ప్రారంభించాయి.

దేశంలో అతిపెద్ద ఉల్లి మార్కెట్ మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న లాసల్‌గావ్ మండి. మంగళవారం మధ్యాహ్నం వరకు ఉల్లి ఎగుమతిపై నిషేధం మార్చి 31 వరకు కొనసాగుతుందని ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చింది. దీంతో ఉల్లి ధర పతనమై క్వింటాల్‌ రూ.150కి పడిపోయింది. అంతకు ముందు ఫిబ్రవరి 19న లాసల్‌గావ్ మండిలో టోకు ఉల్లి ధర క్వింటాల్‌కు 40.62 శాతం పెరిగి రూ.1,800కి చేరుకుంది. ఫిబ్రవరి 17న ఇదే ధర క్వింటాల్‌కు రూ.1,280గా ఉంది. ఉల్లి ఎగుమతిపై నిషేధం కొనసాగుతుందని మంగళవారం ప్రభుత్వం ప్రకటించడంతో వేలం ధర క్వింటాల్‌కు రూ.150 తగ్గి రూ.1,650కి చేరింది. ఈ క్రమంలోనే 8,500 క్వింటాళ్ల ఉల్లికి మార్కెట్‌లో డీల్‌ కుదిరింది.

Read Also:UPSC Notification 2024: 1056 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల..పూర్తి వివరాలివే..

లాసల్‌గావ్ వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ (ఎపిఎంసి) చైర్మన్ బాలాసాహెబ్ క్షీరసాగర్ మాట్లాడుతూ, గత వారం ధరలు పెరిగాయి. అయితే, ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేతకు సంబంధించి ప్రభుత్వ ప్రతిపాదన లేదా ప్రకటన లేకపోవడంతో అవి దాదాపు స్తబ్దుగా మారాయని అన్నారు. గతంలో వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ కూడా ఉల్లి ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని వినియోగదారులకు సరసమైన ధరలకు ఉల్లి తగినన్ని లభ్యమయ్యేలా చూడడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత.

కిలో రూ.600కు చేరిన వెల్లుల్లి
దేశంలోని రిటైల్ మార్కెట్‌లో వెల్లుల్లి ధర కిలో రూ.600కి చేరింది. దేశంలోనే అతిపెద్ద వెల్లుల్లి మార్కెట్‌లలో ఒకటైన గుజరాత్‌లోని జామ్‌నగర్ మండిలో గత కొద్దిరోజులుగా వెల్లుల్లి టోకు ధర కిలో రూ.350కి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో దీని రిటైల్ ధరలు కిలో రూ.500 నుంచి రూ.550కి చేరుకోగా చాలా ప్రాంతాల్లో కిలో రూ.600 వరకు పలుకుతోంది. గతేడాది కంటే ఈసారి వెల్లుల్లి ఉత్పత్తి తక్కువగా ఉంది. దీంతో మార్కెట్‌లో కొత్త పంటల రాక తక్కువ. పాత పంట నిల్వ అయిపోయింది. అందుకే దీని ధర భారీగా పెరిగింది.

Read Also:Mrunal Thakur : ముంబైలో కొత్త ఇల్లు కొన్న మృణాల్.. ధర ఎంతో తెలుసా?