Leading News Portal in Telugu

Byjus : చెల్లించిన ఫీజు రీఫండ్ చేయకపోవడంతో బైజూస్ ఆఫీసులో టీవీ తీసుకెళ్లిన స్టూడెంట్స్



New Project (9)

Byjus : కొన్నేళ్లుగా ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంది. ఇప్పటికే అద్దెలు కట్టలేక పలు ఆఫీసుల్ని ఖాళీ చేస్తోంది. కొన్నాళ్ల క్రితం మరో పెద్ద ఆఫీసు ఖాళీ చేసేసింది. బెంగళూరు ప్రెస్టైజ్ టెక్ పార్కులోని ఏకంగా 4 లక్షల చదరపు అడుగుల మేర విస్తరించి ఉన్న ఆఫీస్ స్పేస్ ఖాళీ చేసింది. ఖర్చుల్ని తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగా బైజూస్ ఇలా చేస్తున్నట్లు వెల్లడించింది. రెంటల్ అగ్రిమెంట్ ఈ ఏడాది ఆరంభంలోనే బైజూస్ రద్దు చేసుకున్నట్లు ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తులు వెల్లడించారు. కొంతకాలంగా ఇక్కడ అద్దె చెల్లించని కారణంగా ముందే చెల్లించిన డిపాజిట్‌తో సర్దుబాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరికొన్ని చోట్ల కూడా ఈ సంస్థకు అద్దెలకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్నట్లు తెలిపారు.

Read Also:Shanmukh Jaswanth Arrest: సినిమాను మించిన ట్విస్టులు.. షన్ను అరెస్ట్ కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

కొన్ని కొన్ని సార్లు సర్వీస్ ప్రొవైడర్ల పనితీరు కస్టమర్లను చికాకు పెడతాయి. తాజాగా ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రొవైడర్ బైజూస్ విషయం లోనూ జరిగింది. ప్రస్తుతం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న బైజూస్.. చెల్లించిన ఫీజులు విద్యార్థులకు తిరిగి చెల్లించడంలో విఫలమైంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైజూస్ ఆఫీసుల పై పడి చేతికి అందిన వస్తువులను తీసుకెళ్తున్నారు. ఫీజులు వాపసు చెల్లించి వస్తువులు తీసుకెళ్లండి అని ఆఫీసులో ఉన్న సిబ్బందికి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తున్నారు. బైజూస్ ఆఫీసులో టీవీ సెట్ ను విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన Edtech Gaint బైజూస్ కస్టమర్ సర్వీస్ గురించి చర్చలకు దారితీసింది.

Read Also:Trisha: 25 లక్షలకు రిసార్టు ఆరోపణలు.. అన్నాడీఎంకే నేతకు త్రిష లీగల్ నోటీస్

భూయజమానులతో కొనసాగుతున్న వివాదాలు, అద్దె చెల్లింపులపై డీఫాల్ట్ అవుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బైజూస్.. తాజా విద్యార్థుల తల్లిదండ్రుల చర్యలు పెద్ద సవాల్ గా మారాయి. ఫీజులు వాపస్ చెల్లించేవరకు వదిలేలా లేరు విద్యార్థులు తల్లిదండ్రులు. ఇది ఇలా ఉంటే.. బైజూస్ సీఈవో ర‌వీంద్ర‌న్ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ లుకౌట్ నోటీసు జారీ చేసింది. లుకౌట్ నోటీసు జారీ చేయాల‌ని ఇమ్మిగ్రేష‌న్ బ్యూరోను ఈడీ కోరింది. బైజూస్ విద్యా సంస్థ సీఈవో దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు ఈడీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. బైజూస్ పేరెంట్ కంపెనీ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ సంస్థ‌కు గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో షోకాజు నోటీసులు జారీ చేశారు.