Leading News Portal in Telugu

Flipkart UPI: కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా యూపీఐ చెల్లింపులు..



Flipkart Upi

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కస్టమర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.. ప్రతి పండుగకు కస్టమర్స్ కు అదిరిపోయే ఆఫర్స్ ను ఇవ్వడంతో పాటుగా ఇప్పుడు మరో కొత్త సర్వీసును అందించబోతుంది.. తాజాగా ఫ్లిప్‌కార్ట్ యుపీఐ సర్వీసుని ప్రారంభించింది. యాక్సిస్ బ్యాంక్ సహకారంతో ఈ-కామర్స్ సంస్థ ఈ సేవను ప్రారంభించింది.. అయితే ఈ సేవలు ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిపింది..

సూపర్ కాయిన్స్ , క్యాష్ బ్యాక్ , మిలిస్టోన్ బెనిఫిట్స్ , బ్రాండ్ వోచర్‌లు వంటి ప్రయోజనాలు ఫ్లిప్కార్ట్ యూపీఐ లో అందుబాటులో ఉంటాయి. కంపెనీ గత సంవత్సరం నుండి తన యూపీఐ సర్వీసును పరీక్షిస్తోంది. ఇప్పుడు సామాన్యుల కోసం దీన్ని ప్రారంభించింది.. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తుంది.. ఈ ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు వారు చెల్లింపు చేయడానికి ఇతర అప్లికేషన్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ కంపెనీ తన వినియోగదారులకు దాని స్వంత యూపీఐ సేవను అందించడానికి సులువుగా ఉంటుంది.. ఈ కొత్త సేవల వల్ల మిగిలిన యాప్ లకు పెద్ద సమస్యలు రావచ్చునని తెలుస్తుంది..

కాగా,యూపీఐ సేవలను అభివృద్ధి చేసేందుకే NPCI కొన్ని కంపెనీల పై యూపీఐ ఆధారపడటాన్ని తగ్గించడానికి కూడా ప్రయత్నిస్తోంది. యూపీఐ చెల్లింపు ద్వారా వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌ మార్కెట్‌లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వ్యాపారి లావాదేవీల ప్రయోజనాలను పొందవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులు మాత్రమే ఫ్లిప్‌కార్ట్ యూపీఐని ఉపయోగించవచ్చు.. అయితే ఐఫోన్ వినియోగదారులకు ఈ సర్వీసు అందుబాటులో లేదని తెలుస్తుంది..