Leading News Portal in Telugu

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే?



Gold Price Today

Gold and Silver Price in Hyderabad on 2024 March 7: బంగారం ధరలు రోజురోజుకు ఎగబాకుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రూ.65000 దాటింది. గత వారం రోజుల్లోనే పది గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ. 2,300 పెరిగింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు పసిడి ధరల ఏ రేంజ్‌లో దూసుకుపోతున్నాయో. మంగళవారం ఒక్కరోజే రూ.700 పెరిగిన విషయం తెలిసిందే. నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో గురువారం గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

బులియన్ మార్కెట్‌లో గురువారం (మార్చి 7) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,710గా ఉండగా.. 24 క్యారెట్ల (999 గోల్డ్) 10 గ్రాముల ధర రూ.65,140 గా ఉంది. నిన్నటితో పోలిచ్చుకుంటే 22 క్యారెట్ల బంగారంపై రూ.10.. 24 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరిగింది. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గుతాయనే సూచనలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తొలగకపోవడమే ఈ పెరుగుదలకు కారణం అని నిపుణులు అంటున్నారు. దేశీయంగా వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉండడంతో అమ్మకాలు పుంజుకుంటున్నట్లు తెలిసింది.

ఢిల్లీ:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,860
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,290

ముంబై:
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.59,710
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,140

చెన్నై:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,410
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,900

బెంగళూరు, కోల్‌కతా, కేరళ:
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.59,710
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,140

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,710
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,140

Also Read: Nepal : నదిలో పడిన బస్సు.. ఏడుగురి మృతి, 30మందికి గాయాలు

మరోవైపు నేడు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.100 తగ్గి.. రూ.74,400లుగా ఉంది. నేడు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,400గా ఉంది. ముంబైలో రూ.74,400 ఉండగా.. చెన్నైలో రూ.77,900గా కొనసాగుతోంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.77,900లుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,100గా ఉంది.