Leading News Portal in Telugu

International Womens Day: మహిళా డ్రైవర్స్ కోసం జోమాటో కొత్త డ్రెస్ కోడ్‌..



Zomato (3)

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో తమ కస్టమర్ల తో పాటు డెలివరీ బాయ్స్, గర్ల్స్ కోసం ప్రత్యేకమైన ఆఫర్స్ ను ఇస్తుంది.. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, జొమాటో మహిళా డెలివరీ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఫుడ్ డెలివరీ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది .. అయితే మహిళా డ్రైవర్లు ఇప్పుడు కుర్తాలను ఎంచుకోవచ్చని పంచుకున్నారు.. అందుకు సంబందించిన వీడియోను కూడా జోమాటో వదిలింది..

ఈ రోజు నుండి Zomato మహిళా డెలివరీ ఉద్యోగులు కుర్తా ధరించడాన్ని ఎంచుకోవచ్చు అని కంపెనీ పోస్ట్ యొక్క శీర్షికలో రాసింది. దానితో పాటు, మహిళా డెలివరీ డ్రైవర్లు కొత్తగా రూపొందించిన కుర్తాలను ధరించిన వీడియోను కూడా వారు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వీడియోలోని మహిళలు కంపెనీ అందించిన కొత్త దుస్తులను ప్రశంసించడం చూడవచ్చు.. ఇవి చాలా బాగున్నాయని వారు చెప్పుకొచ్చారు..

ఈ వీడియోను కొన్ని గంటల క్రితమే షేర్ చేశారు.. ప్రస్తుతం ఆ వీడియోను మూడు లక్షల మంది చూసారు.. అలాగే 46,000 కంటే ఎక్కువ లైక్‌లు మరియు అనేక కామెంట్‌లు కూడా ఉన్నాయి. చాలా మంది Zomato యొక్క కొత్త ఐడియాను మెచ్చుకున్నారు.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..

 

View this post on Instagram

 

A post shared by Zomato (@zomato)