Leading News Portal in Telugu

Nita Ambani : నీతా అంబానీ ధరించిన ఈ నగ ధర ఎన్ని కోట్లో తెలుసా?



Nithuu

ప్రముఖ వ్యాపార వేత్త రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ ఎప్పుడు ఖరీదైన వస్తువులను వాడుతూ వార్తల్లో హైలెట్ అవుతుంది.. ఇటీవల తన్న చిన్నకొడుకు పెళ్లిలో చాలా ప్రత్యేకంగా నిలిచారు. స్వయంగా డ్యాన్సర్‌ అయిన ఆమె అంబానీ కుటుంబవేడుకల్లో తన డ్యాన్స్‌ పెర్ఫార్మన్స్ తో అందరిని ఆకట్టుకుంది.. నీతా అంబానీ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది..తన లుక్స్, ఫ్యాషన్‌తో అతిథులను సర్‌ప్రైజ్‌ చేశారు. ఆ పెళ్లిలో ఆమె ధరించిన ఖరీదైన డైమండ్ నెక్లెస్ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది..

ఇప్పుడు మరోసారి ఖరీదైన నగ, ఇయర్ రింగ్స్ ధరించి అందరిని ఆకట్టుకున్నారు.. తాజాగా ముంబైలో జరిగిన ఒక వేడుకలో బనారసీ చీరలో మెరిసిపోయారు. అంతేకాదు ఈ సందర్బంగా ఆమె ధరించిన అరవంకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దాని ధర విని అందరు షాక్ అవుతున్నారు.. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ జరుగుతుంది..

ఇటీవల ముంబైలో జరిగిన 71వ మిస్ వరల్డ్ ఈవెంట్‌లో రిలయన్స్‌ ఫౌండేషన్‌ ద్వారా నీతా చేసిన దాతృత్వ సేవలకు గాను ‘బ్యూటీ విత్ పర్పస్ హ్యుమానిటేరియన్ అవార్డు’ అందుకున్నారు. ఈ సందర్భంగా హ్యాండ్‌ మేడ్‌ జాంగ్లా డిజైన్‌ బనారసీ చీరలో అందరిని ఆకట్టుకుంది.. అలాగే ఇయర్ రింగ్స్ కూడా కోటికి పైగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ చక్రవర్తి శిరస్సుపై కల్గిని మళ్లీ తయారు చేశారట.. ఈ అరవంకి ధర దాదాపుగా 200 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం..ఏది ఏమైనా దీని ధర మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..