
PM Modi : ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ ఇవ్వడానికి ఇ-మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (EMPS 2024) ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే ఈ మేరకు బుధవారం వెల్లడించారు. ఏప్రిల్ నుంచి 4 నెలల పాటు ఈ పథకం కింద రూ. 500 కోట్లు కేటాయించినట్లు ఆయన ప్రకటించారు. భారత్‌లో ఈ-మొబిలిటీని ప్రోత్సహించేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
Read Also:Harish Sankar : రోడ్డు పై ఆగిన కారును తోసిన హరీష్ శంకర్.. వీడియో వైరల్…
కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలపై భారీగా సబ్సిడీ ఇవ్వనున్నారు. ఈ పథకం ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుంది. ఇది 4 నెలల వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ లెక్కన 2024 జూలై వరకు మాత్రమే ఈ పథకం అందుబాటులో ఉంటుందని మంత్రి మహేంద్రనాథ్ పాండే తెలిపారు. ఈ పథకం కింద 3.3 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు గరిష్టంగా రూ. 10 వేల వరకు సబ్సిడీ ఇస్తారు. 31 వేలు ఇ-రిక్షాలపై (చిన్న మూడు చక్రాల వాహనాలు) రూ. 25 వేల సబ్సిడీ వస్తుంది. అదే పెద్ద మూడు చక్రాల వాహనాలకు రూ. 50 వేలు సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.
Read Also:One-Nation- One Poll: ఒకే దేశం- ఒకే ఎన్నికపై రాష్ట్రపతికి నివేదిక..
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా గతంలో కేంద్రం తీసుకొచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సెకండ్ ఫేజ్ (FAME-II) పథకం 2024 మార్చి 31తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ద్విచక్ర వాహనాలతోపాటు ఇతర ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. ఈ గడువును మరోసారి పొడిగించే ఆలోచన లేదని, ఈవీల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చామని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. మరోవైపు, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MHI) IIT రూర్కీతో MOU కుదుర్చుకుంది. ఐఐటీ రూర్కీలో ఎలక్ట్రిక్ వాహనాలతో సహా రవాణా రంగానికి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ ఇండస్ట్రీ యాక్సిలరేటర్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ MHI కోసం రూ. 19.87 కోట్లు గ్రాంట్ విడుదల చేయగా.. పరిశ్రమల భాగస్వాములు రూ. 4.78 కోట్లు అందించనున్నారు.