Leading News Portal in Telugu

Gold Prices Today: గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?



Gld

పసిడి ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు ఈరోజు కూడా స్వల్పంగా తగ్గాయి.. శనివారం స్వల్పంగా తగ్గాయి.. 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 10 తగ్గి.. రూ. 60,590కి చేరింది.. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి ధర రూ. 10 తగ్గి రూ. 66,100కి చేరింది.. ఇక వెండి ధరలు కూడా స్వల్పంగా దిగి వచ్చాయి.. 100 తగ్గి రూ. 76,900గా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం..

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 60,590గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,100గా నమోదైంది.. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,600, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,110 గా ఉంది.. చెన్నైలో22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,350, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,930 వద్ద కొనసాగుతుంది.. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,600 వద్ద ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,110 వద్ద కొనసాగుతుంది..

ఇక వెండి ధర విషయానికొస్తే…బంగారం దారిలోనే నడిచాయి.. స్వల్పంగా తగ్గింది.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 79,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 76,900.. బెంగళూరులో రూ. 76,100గా ఉంది.. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..