Leading News Portal in Telugu

Gold Price Today: మహిళలకు శుభవార్త.. స్వల్పంగా తగ్గిన బంగారం వెండి ధరలు!



Gold Price Today

Today’s Gold and Silver Rates in Hyderabad on 2024 March 21: బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త. ఇటీవలి రోజుల్లో పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు.. నేడు స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (మార్చి 21) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,790గా ఉండగా.. 24 క్యారెట్ల (999 గోల్డ్) 10 గ్రాముల ధర రూ.66,320గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారంపై రూ.10.. 24 క్యారెట్ల బంగారంపై రూ.10 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,940గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,470గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,790 కాగా.. 24 క్యారెట్ల 10 ధర రూ.66,320గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.61,410.. 24 క్యారెట్ల ధర రూ.66,990గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళ, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,970 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.66,320గా నమోదైంది.

Also Read: Off The Record : ఏపీలో బీజేపీకి అభ్యర్థులు దొరకడం లేదా..?

నేడు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. కిలో వెండిపై రూ.100 తగ్గి.. రూ.76,900లుగా ఉంది. ఈరోజు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,900 ఉండగా.. ముంబైలో రూ.76,900గా ఉంది. చెన్నైలో రూ.79,900గా నమోదవగా.. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.79,900లుగా ఉంది. కిలో వెండి ధర అత్యల్పంగా బెంగళూరులో రూ.75,400గా ఉంది.