Leading News Portal in Telugu

Layoffs: 10 నిమిషాల వీడియో కాల్.. 400 మందికి పైగా ఉద్యోగులకు లేఆఫ్..



Layoff

Layoffs: టెక్ సంస్థల్లో ఉద్యోగాల లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. రెండేళ్లుగా ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో అని టెక్కీలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలైన మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్‌లో పాటు చిన్నాచితకా కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక అస్థిరత కారణంగా ఖర్చులను తగ్గించుకోవాలనే ఆలోచనలతో సంస్థలు ఉద్యోగులను తీసేస్తున్నాయి.

Read Also: PM Modi: ప్రధాని మోడీపై “ఔరంగజేబు” వ్యాఖ్యలు.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు..

ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సంస్థ బెల్(Bell) లేఆఫ్ ప్రకటించింది. కేవలం 10 నిమిషాల వీడియో కాల్‌లో ఏకంగా 400 మందికి పైగా ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల జరిగిన కంపెనీ వర్చువల్ గ్రూప్ మీటింగ్‌లో బెల్ మేనేజర్ ఈ లేఆఫ్ నోటీసును చదివి వినిపించాడు. ఈ ఏడాది ఉద్యోగుల తొలగింపుపై కంపెనీ సీఈఓ మిర్కో బిబిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మరిన్ని కోతలు ఉంటాయని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో 4800 మందిని తొలగించాలని చూస్తోంది. ఇది మొత్తం కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో 9 శాతం.

మరోవైపు ఇలా లేఆఫ్స్ ప్రకటించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది సిగ్గుమాలిన చర్య అని కెనడాకు చెంది ఉద్యోగుల సంఘం ‘యూనిఫోర్’ విమర్శించింది. నిమిషాల వ్యవధిలో లేఆఫ్ ప్రకటన చేశారని, కనీసం ఉద్యోగులు ప్రశ్నించే సమయం, అనుమతి కూడా ఇవ్వలేదని ఆరోపించింది. ఓ వైపు వాటాదారులకు డివిడెంట్ పే అవుట్ పెంచడంతో పాటు సామాన్య ఉద్యోగులను తొలగించడాన్ని తప్పుబట్టింది.