Leading News Portal in Telugu

Reliance Jio: ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా జియో..



Jio

టెలికం రంగంలోకి అడుగు పెట్టి సంచలనం సృష్టించి దేశంలోనే అతి పెద్ద టెలికం నెట్‌వర్క్‌గా అవతరించిన రిలయన్స్ జియో ఇప్పుడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద టెలికం నెట్‌వర్క్‌గా జియో నిలిచింది. మొబైల్ డేటా ట్రాఫిక్ విషయంలో చైనా మొబైల్‌ను జియో దాటేసింది. 2024 తొలి త్రైమాసికంలో చైనా మొబైల్ 38 ఎగ్జాబైట్స్ ట్రాఫిక్ నమోదు చేయగా.. అదే టైంలో 40. 9 ఎగ్జాబైట్స్ జియో డేటా వినియోగమైనట్టు గ్లోబల్ అనలటిక్స్ సంస్థ టెఫిసియెంట్ వెల్లడించింది.

Read Also: Shubman Gill: అందుకే భారీ స్కోర్లు నమోదవుతున్నాయి.. మా తప్పిదాలు కూడా ఉన్నాయి: గిల్‌

అలాగే, జియో ఖాతాలో మరో రికార్డును కూడా దక్కించుకుంది. 108 మిలియన్ మంది సబ్‌ స్క్రైబర్లతో జియో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద 5 సబ్‌ స్క్రైబర్ బేస్‌ను కలిగి ఉన్న ఘనతను సొంతం చేసుకుంది. ఇక, జియో మొత్తం మొబైల్ డేటా ట్రాఫిక్‌లో ఇప్పుడు 28 శాతం 5జీ యూజర్ల నుంచే నమోదు అవుతుంది. జియో భారత్ వాల్యూ ప్లాన్లు, అన్‌ లిమిటెడ్ 5జీ ఆఫర్లతో కూడి ప్రమోషనల్ ప్యాక్‌ల కారణంగా జియో సబ్‌ స్కైబర్లు వేగంగా పెరిగిపోతున్నారు.