Leading News Portal in Telugu

Amazon Summer Sale 2024: అమెజాన్ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఆ ఫోన్ల పై భారీ డిస్కౌంట్..



Amazon (4)

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ తమ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్స్ ను ప్రకటిస్తూ వస్తుంది.. ప్రతి పండుగకు ఏదొక ఆఫర్ ద్వారా మొబైల్స్, ఇతర వస్తువుల పై భారీ తగ్గింపు ఆఫర్స్ ను అందిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరోసారి మొబైల్స్ పై భారీ తగ్గింపును అందిస్తుంది.. తాజాగా అమెజాన్ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ ను ప్రకటించారు.. ఈ సేల్ లో భాగంగా పలు బ్రాండ్స్ మొబైల్స్ పై భారీ ఆఫర్స్ ను అందిస్తున్నాయి.. ఏ మొబైల్స్ పై ఆఫర్స్ ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకుందాం..

ఈ భారీ సేల్ మే 2 మధ్యాహ్నం నుంచి ఈ సేల్‌ ప్రారంభం కానుందని అమెజాన్ పేజీ ద్వారా తెలుస్తోంది.. అమెజాన్ ప్రైమ్ యూజర్స్ కు మాత్రం 12 గంటల ముందే సేల్ ప్రారంభం కానుంది.. ఈ సేల్ లో భాగంగా శాంసంగ్‌, వన్‌ ప్లస్‌, రెడ్‌మి, షియోమీ, ఐకూ, టెక్నో వంటి అనేక స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌ను పొందవచ్చు. వీటి వివరాలను కూడా అమెజాన్‌ వెల్లడించింది.. ఇక ఆలస్యం ఎందుకు ఏ ఫోన్ల పై ఎంత ఆఫర్ ఉందో ఒకసారి చూసేద్దాం..

ఈ లిస్ట్ లో వన్‌ ప్లస్‌ 12, వన్‌ ప్లస్‌ 12R, వన్‌ప్లస్ నార్డ్‌ CE, వన్‌ప్లస్ నార్డ్‌ 3 సహా శాంసంగ్ గెలాక్సీ M34, శాంసంగ్‌ గెలాక్సీ S23, గెలాక్సీ S24, రెడ్‌మి నోట్‌ 13 ప్రో, రెడ్‌మి 13C, షియోమీ 14, ఐకూ Z9, టెక్నో పోవా 6 ప్రో హ్యాండ్‌ సెట్‌లు డిస్కౌంట్‌ ను పొందవచ్చు.. అయితే ఏ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే ఎంత ఆఫర్ వస్తుందో తెలియలేదు.. త్వరలోనే మరో ప్రకటన రాబోతుందని సమాచారం.. ICICI బ్యాంక్‌ మరియు బ్యాంక్‌ ఆఫ్ బరోడా కార్డుల ద్వారా కూడా డిస్కౌంట్ పొందవచ్చు.. ఇక అదే విధంగా ఫ్లిప్ కార్ట్ కూడా అదిరిపోయే ఆఫర్స్ ను ప్రకటించించింది..