Leading News Portal in Telugu

Credit Cards: అన్నింటికీ క్రెడిట్ కార్డు వాడేస్తున్నారా..? కొత్త రూల్స్‌తో జాగ్రత్త..



Credit Card

Credit Cards: క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదారులకు ముఖ్య గమనిక. మే 1 నుంచి పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డ్‌ లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇటీవలే ఎస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లు మే 1వ తేదీ నుంచి తమ క్రెడిట్‌ కార్డ్‌ నుంచి యుటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రిసిటీ బిల్‌, వాటర్‌ బిల్‌, గ్యాస్‌ బిల్‌ చెల్లిస్తే ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపాయి. దీనిప్రకారం మీరు ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ క్రెడిట్ కార్డు వినియోగిస్తూ, నెలవారీ కరెంటు బిల్ 15 వందలు చెల్లిస్తుంటే..అదనంగా 15 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే.. ఇక్కడ కూడా బ్యాంకులు ఉచిత లావాదేవీలకు కొంత లిమిట్ ప్రకటించాయి. వినియోగదారులు ఎస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌పై 15,000, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌పై 20,000 రూపాయల వరకూ ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. లిమిట్‌ దాటితే వన్ పర్సెంట్‌ ఛార్జీలు అమల్లోకి వస్తాయి. 18 శాతం జీఎస్టీని సైతం చెల్లించాల్సి ఉంటుంది. కాగా, క్రమంగా క్రెడిట్‌ కార్డుల వినియోగం పెరుగుతోన్న విషయం విదితమే.. కొందరు ఇంటి అద్దులు సహా వివిధ బిల్లులను క్రెడిట్‌ కార్డుపై కట్టేస్తున్నారు. ఆ తర్వాత వెసులుబాటును బట్టి చెల్లిస్తున్నారు. ఇప్పటికే ఇంటి అద్దెలపై అదనపు చార్జీలు వడ్డిస్తున్నాయి కొన్ని బ్యాంకులు.. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ, వాటర్‌, గ్యాస్‌.. ఇలా పలురకాల బిల్లు చెల్లింపై కూడా వడ్డించేందుకు సిద్ధం అయ్యాయి.

అసలు ఎందుకు ఈ మార్పు? బ్యాంకులు ఈ రుసుములను అమలు చేయడానికి రెండు ప్రధాన కారణాలు చెబుతున్నాయి.. తక్కువ వ్యాపారి తగ్గింపు రేటు (MDR): ప్రతి క్రెడిట్ కార్డ్ లావాదేవీకి చెల్లింపు గేట్‌వేలు వ్యాపారాలు వసూలు చేసే రుసుములను MDR సూచిస్తుంది. MDR వర్గాన్ని బట్టి మారుతుంది (కిరాణా, ప్రయాణం మొదలైనవి). యుటిలిటీ బిల్లు చెల్లింపుల కోసం, ఇతర వర్గాలతో పోలిస్తే MDR సాధారణంగా తక్కువగా ఉంటుంది. ఇతర కొనుగోళ్లతో పోలిస్తే యుటిలిటీలను చెల్లించడానికి మీరు మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించినప్పుడు బ్యాంకులు తక్కువ డబ్బు సంపాదిస్తాయి. రెండోది వ్యాపార దుర్వినియోగానికి సంభావ్యత: కొన్ని వ్యాపారాలు తమ వ్యాపార సంబంధిత యుటిలిటీ బిల్లులను చెల్లించడానికి వ్యక్తిగత క్రెడిట్ కార్డ్‌లను దుర్వినియోగం చేయవచ్చు. సాధారణ కుటుంబానికి చెందిన యుటిలిటీ బిల్లు మొత్తం సాధారణంగా వ్యక్తిగత కార్డ్‌పై క్రెడిట్ పరిమితి కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి, వ్యాపారాలు తమ ప్రయోజనం కోసం దీనిని ఉపయోగించుకోవడం ఉత్సాహం కలిగిస్తుంది. అదనపు రుసుము అటువంటి పద్ధతులను నిరుత్సాహపరుస్తుంది.