Leading News Portal in Telugu

Gold Rate Today: మగువలకు శుభవార్త.. తులం బంగారంపై ఏకంగా రూ.1000 తగ్గింది!


Gold Rate Today: మగువలకు శుభవార్త.. తులం బంగారంపై ఏకంగా రూ.1000 తగ్గింది!

Gold Rate Drops Rs 1000 Today in Hyderabad: ఇటీవలి కాలంలో బంగారం ధరలు రికార్డ్ స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా రూ.75 వేల మార్క్‌కి చేరుకుంది. అయితే పెరుగుతూ పోయిన పసిడి ధరలు.. ఇటీవలి రోజుల్లో దిగొస్తున్నాయి. గత మూడు రోజులుగా స్వల్పంగా తగిన గోల్డ్ రేట్స్.. నేడు భారీగా తగ్గాయి. తులం బంగారంపై ఏకంగా రూ.1000 తగ్గింది. గురువారం (మే 23) బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరూ.67,300గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,420 వద్ద కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.


ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,450గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73570గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67300 కాగా.. 24 క్యారెట్ల 10 ధర రూ.73420గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.67500.. 24 క్యారెట్ల ధర రూ.73640గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళ, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67300 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.73,420గా నమోదైంది.

నేడు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండిపై ఏకంగా రూ.3,300 తగ్గి.. రూ.92,500లుగా ఉంది. ఈరోజు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.92,500 ఉండగా.. ముంబైలో రూ.92,500గా ఉంది. చెన్నైలో రూ.97,000లుగా నమోదవగా.. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.97,000లుగా ఉంది. కిలో వెండి ధర బెంగళూరులో రూ.95,600గా ఉంది.