
Today Gold Rates on 30 May 2024 in India: మగువలకు శుభవార్త. వరుసగా మూడో రోజులు పెరిగిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి. గురువారం (మే 30) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,760గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే.. 22 క్యారెట్లపై రూ.400, 24 క్యారెట్లపై రూ.440 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
హైదరాబాద్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,760గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,850గా కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,910గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.66,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,910గా ఉంది. బెంగళూరు, కోల్కతా, కేరళలలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.66,700 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,760గా ఉంది.
మరోవైపు వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండిపై ఈరోజు రూ.1,200 తగ్గి.. రూ.96,500గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.96,500 కాగా.. ముంబైలో రూ.96,500గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.1,01,000లుగా నమోదవగా.. బెంగళూరులో రూ.97,500గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.1,01,000లుగా నమోదైంది.