Leading News Portal in Telugu

Stock Market: వరుసగా ఐదో రోజూ నష్టాలే.. కారణమిదేనా?


Stock Market: వరుసగా ఐదో రోజూ నష్టాలే.. కారణమిదేనా?

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాల కారణంగా భారతీయ సూచీలపై ప్రభావం చూపించాయి. గత శుక్రవారం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇక గురువారం సెన్సెక్స్ 617 పాయింట్లు నష్టపోయి 73, 885 దగ్గర ముగియగా.. నిఫ్టీ 216 పాయింట్లు నష్టపోయి 22, 488 దగ్గర ముగిసింది. బ్యాంక్‌లు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి.


ఇది కూడా చదవండి: Noida: ఎండ తీవ్రతకు బాల్కనిలో వాషింగ్ మిషన్ పేలి.. భారీగా మంటలు

నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో టాటా స్టీల్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీలు ఉన్నాయి. ఇక సెన్సెక్స్‌ సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్ లాభపడ్డాయి. సెక్టార్లలో బ్యాంక్ ఇండెక్స్ 0.5 శాతం లాభపడగా.. ఆటో, ఎఫ్‌ఎమ్‌సీజీ, మెటల్, ఐటీ, హెల్త్‌కేర్ 1-2 శాతం క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 1.3 శాతం చొప్పున క్షీణించాయి.

ఇది కూడా చదవండి: All Eyes On Rafah: అప్పుడు మీ అందరి కళ్లు ఎక్కడున్నాయి.. ‘‘ఆల్ ఐస్ ఆన్ రఫా‌’’పై ఇజ్రాయిల్ ఆగ్రహం..

ఇక ఉదయం ప్రారంభ సమయంలో సెన్సెక్స్‌ 201 పాయింట్ల నష్టంతో 74,301 వద్ద ట్రేడ్ అవ్వగా.. నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 22,655 దగ్గర కొనసాగింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.43 దగ్గర ప్రారంభమైంది.

ఇది కూడా చదవండి: Drugs in Hyderabad: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత