Leading News Portal in Telugu

Heritage foods: హెరిటేజ్‌కు కాసుల పంట.. 5 రోజుల్లో సంపాదన ఎంతంటే..!


Heritage foods: హెరిటేజ్‌కు కాసుల పంట.. 5 రోజుల్లో సంపాదన ఎంతంటే..!

స్టాక్ మార్కెట్‌లో హెరిటేజ్ ఫుడ్‌కు కాసుల పంట మొదలైంది. మునుపెన్నడూ లేని విధంగా లాభాలను సొంతం చేసుకుంది. శుక్రవారం ఆల్‌టైమ్ రికార్డు లాభాలను అర్జించింది.  ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తెలుగు దేశం పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. అత్యధిక సీట్లను సొంతం చేసుకోవడమే కాకుండా.. రాష్ట్రంలోనూ.. కేంద్రంలోనూ చంద్రబాబు కింగ్ మేకర్‌గా నిలిచారు. దీంతో స్టాక్ మార్కెట్‌లో హెరిటేజ్ ఫుడ్‌కు కొత్త ఊపు తీసుకొచ్చింది.


 

Hertige

ఎన్నికల ఫలితాలకు ముందు జూన్ 3న హెరిటేజ్ ఫుడ్స్ రూ.424 దగ్గర ట్రేడ్ అవ్వగా.. శుక్రవారం రూ.661.25 దగ్గర ట్రేడ్ అయింది. దీంతో చంద్రబాబు భార్య భువనేశ్వరి సంపద ఐదు రోజుల్లో రూ.535 కోట్లు, కుమారుడు లోకేష్ రూ.237 కోట్లు సంపాదించారు. ఐదు రోజుల్లో హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు 55 శాతం పెరిగాయి. హెరిటేజ్ ఫుడ్స్‌లో చంద్రబాబు ఫ్యామిలీకి 35.7 శాతం వాటా ఉంది. భువనేశ్వరికి 24.37 శాతం, కుమారుడు లోకేష్‌కు 10.82 శాతం, కోడలు బ్రాహ్మణికి 0.46 శాతం వాటా ఉంది. మనవడు దేవాన్ష్‌కు డెయిరీ కంపెనీలో 0.06 శాతం వాటా ఉంది. జూన్ 7న ఎన్‌ఎస్‌ఈలో హెరిటేజ్ ఫుడ్స్ షేరు 10 శాతం పెరిగి రూ.661.25 దగ్గర ముగిసింది.

H F

హెరిటేజ్ ఫుడ్స్‌ను 1992లో చంద్రబాబు స్థాపించారు. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పబ్లిక్-లిస్టెడ్ కంపెనీల్లో ఒకటిగా హెరిటేజ్ కంపెనీ అభివర్ణించింది. హెరిటేజ్ సంస్థకు రెండు వ్యాపార విభాగాలు ఉన్నాయి. డెయిరీ మరియు పునరుత్పాదక శక్తి. ప్రస్తుతం హెరిటేజ్ నుంచి పాలు,పాల ఉత్పత్తులు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ల్లో హెరిటేజ్ ఫుడ్స్ అమ్ముడవుతున్నాయి.

జూన్ 4న వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఊహించని విక్టరీని సొంతం చేసుకుంది. టీడీపీ పోటీ చేసిన 17 స్థానాల్లో 16 సీట్లు గెలుచుకుంది. ఇక ఎన్నికల్లో ఎన్‌డీఏ గెలుపులో కీలకపాత్ర పోషించింది. అలాగే మోడీ ప్రభుత్వంలో చంద్రబాబు కింగ్ మేకర్‌గా నిలిచారు. 543 స్థానాలున్న లోక్‌సభలో ఎన్డీయే 293 స్థానాలను గెలుచుకుంది. గత రెండు పర్యాయాల్లో చక్కని మెజారిటీ సాధించిన బీజేపీ ప్రభుత్వ.. తాజా ఫలితాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 మార్కు కంటే 240 సీట్లు మాత్రమే సాధించింది.