Leading News Portal in Telugu

Stock market: మరోసారి రికార్డులు సృష్టించిన సూచీలు


  • మరోసారి రికార్డులు సృష్టించిన సూచీలు

  • రెండ్రోజుల వరుస నష్టాలకు శుక్రవారం బ్రేకులు
Stock market: మరోసారి రికార్డులు సృష్టించిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌లో రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. తాజాగా మరోసారి సూచీలు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. ఐటీ మెరుపులతో శుక్రవారం నిఫ్టీ, సెన్సెక్స్ రికార్డు గరిష్టాలను తాకాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయ సూచీలు మాత్రం ఆరంభం నుంచి హైలో ట్రేడ్ అయ్యాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 622 పాయింట్లు లాభపడి 80, 519 దగ్గర ముగియగా.. నిఫ్టీ 186 పాయింట్లు లాభపడి 24, 502 దగ్గర ముగిసింది. ఇక డాలర్‌పై రూపాయి మారకం విలువ రూ.83.56 దగ్గర ముగిసింది.

 

నిఫ్టీలో టీసీఎస్, విప్రో, ఎల్‌టిఐఎండ్‌ట్రీ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అత్యధికంగా లాభపడగా.. మారుతీ సుజుకీ, దివిస్ ల్యాబ్స్, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి.