Leading News Portal in Telugu

LPG Price: పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు..ఎంతంటే.?


  • ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్‌ ధరల్లో మార్పు
  • బడ్జెట్ తర్వాత..పెంచిన చముర మార్కెటింగ్
  • రూ.8.50కి పెరిగిన 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్
  • 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర యథాతథం
LPG Price: పెరిగిన  ఎల్‌పీజీ  సిలిండర్ ధరలు..ఎంతంటే.?

నేటి నుంచి ఆగస్టు నెల ప్రారంభమైంది. ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్‌ ధరల్లో మార్పు చోటుచేసుకుంది. బడ్జెట్ తర్వాత.. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్ పీజీ సిలిండర్ ధరలను పెంచాయి. ఈసారి కూడా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో పెరుగదల కనిపించింది. 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం యథాతథంగా ఉంది. వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర గురువారం నుంచి రూ.8.50 పెరిగింది.

READ MORE: CM Revanth Reddy: నేడు రంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

ఐవోసీఎల్ వెబ్‌సైట్ ప్రకారం.. ఉదయం 6 గంటల నుంచే వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. తాజా మార్పు తర్వాత ఇప్పుడు రాజధాని ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1646 నుంచి రూ.1652.50కి పెరిగింది. ఇక్కడ సిలిండర్‌పై రూ.6.50 చొప్పున పెంచారు. కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.8.50 పెరిగింది. ఇప్పటివరకు రూ. 1756 గా ఉన్న 19 కిలోల సిలిండర్ ఇప్పుడు రూ. 1764.5లకు చేరింది. ముంబైలో ఈ ధర రూ.7 పెరిగింది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుత ధర రూ. 1896 గా ఉంది.

READ MORE:Infosys: పన్ను ఎగవేసిన ఇన్ఫోసిస్‌..!రూ. 32 వేల కోట్ల జీఎస్టీ నోటీసు

జులైలో ధర తగ్గింపు..
జులై నెలలో చమురు మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ ధరలు తగ్గిన విషయం తెలిసిందే. ఒక వైపు.. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలలో నిరంతరం మారుతోంది. మరోవైపు, చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశీయ గ్యాస్ సిలిండర్ల ధరలను నిశ్చలంగా ఉంచాయి. గత మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై ధర 100 రూపాయలు తగ్గించిన విషయం విదితమే. ఆ ధర ప్రస్తుతం అలాగే ఉంది.