Leading News Portal in Telugu

Stock market: మరోసారి రికార్డులు సృష్టించిన స్టాక్ మార్కెట్


  • మరోసారి రికార్డులు సృష్టించిన స్టాక్ మార్కెట్

  • సెన్సెక్స్ 82 వేల మార్కు.. నిఫ్టీ 25 వేల మార్కు క్రాస్
Stock market: మరోసారి రికార్డులు సృష్టించిన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు గురువారం చరిత్ర సృష్టించాయి. సెన్సెక్స్ 82 వేల మార్కు.. నిఫ్టీ 25 వేల మార్కు దాటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు బాగా కలిసొచ్చింది. ఉదయం ఉత్సాహంతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా అదే ఒరవడి కొనసాగించింది. సెన్సెక్స్ 126 పాయింట్లు లాభపడి 81, 867 దగ్గర ముగియగా.. నిఫ్టీ 59 పాయింట్లు లాభపడి 25, 010 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.72 దగ్గర స్థిరంగా ముగిసింది.

ఇది కూడా చదవండి: National Girlfriends Day 2024: జాతీయ గర్ల్‌ఫ్రెండ్స్ దినోత్సవం.. ప్రత్యేకత ఏంటంటే?

నిఫ్టీలో కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్ప్, శ్రీరామ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఓఎన్‌జీసీ టాప్ రేంజ్‌లో కొనసాగగా.. ఎం అండ్ ఎం, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ నష్టపోయాయి.సెక్టార్లలో ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, మీడియా, టెలికాం, పీఎస్‌యూ బ్యాంక్ మరియు రియల్టీ 0.5-2 శాతం క్షీణించగా.. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ మరియు ఎనర్జీలో కొనుగోళ్లు కనిపించాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు దాదాపు 1 శాతం చొప్పున క్షీణించాయి.

ఇది కూడా చదవండి: Wayanad landslide: వయనాడ్‌లో రాహుల్, ప్రియాంక పర్యటన.. బాధితుల పరామర్శ