- మరో సేల్‌కు సిద్ధమైన అమెజాన్
- ఆగస్టు 6 నుంచి గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్
- ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచాత్ సేల్

Amazon Great Freedom Festival Sale 2024 Starts From August 6: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ మరో సేల్‌కు సిద్ధమైంది. ఇటీవల ప్రైమ్ మెంబర్ల కోసం ‘ప్రైమ్ డే’ సేల్ నిర్వహించిన అమెజాన్.. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహించనుంది. ఆగస్టు 6 నుంచి 11వ వరకు ఐదు రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. ప్రైమ్ మెంబర్లకు 6వ తేదీ అర్ధరాత్రి నుంచి.. సాధారణ కస్టమర్లకు మధ్యాహ్నం నుంచి ఈ సేల్ అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో అన్ని వస్తువులపై భారీగా ఆఫర్స్ ఉన్నాయి.
గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో మొబైల్స్‌పై 40 శాతం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 80 శాతం, ఫ్యాషన్ ఉత్పత్తులపై 70 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు అమెజాన్ పేర్కొంది. దీనికి సంబంధించి వెబ్‌సైట్‌లో అమెజాన్ బ్యానర్‌లను ఉంచింది. స్మార్ట్‌టీవీలు, ప్రొజెక్టర్లు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లపైనా భారీగా డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఉత్పత్తుల వారీగా ఆఫర్ల వివరాలు త్వరలో రివీల్ కానున్నాయి. సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బచాత్ సేల్’ నేటితో ముగియనుంది. ఆగష్టు 15, రాఖీ సందర్భంగా మరో సేల్ వచ్చే అవకాశం ఉంది.