Leading News Portal in Telugu

Success Story: హోటల్‌లో వెయిటర్‌గా ప్రస్థానం..ఇప్పుడు నెలకు రూ.18 కోట్ల సంపాదన


  • కేఆర్ భాస్కర్ కర్ణాటక వాసి
  • పురాన్‌పోలి ఘర్‌ ఆఫ్‌ భాస్కర్‌ బ్రాండ్‌ యజమాని
  • పురంపోలి అమ్మడం ద్వారా ప్రతి నెలా కోట్ల సంపాదన
  • హోటల్‌లో వెయిటర్‌గా ప్రస్థానం ప్రారంభం
  • ప్రస్తుతం ఆయన పేరుపై ఓ బ్రాండ్
Success Story:  హోటల్‌లో వెయిటర్‌గా ప్రస్థానం..ఇప్పుడు నెలకు రూ.18 కోట్ల సంపాదన

కేఆర్ భాస్కర్ కర్ణాటక వాసి. ‘పురాన్‌పోలి ఘర్‌ ఆఫ్‌ భాస్కర్‌’ బ్రాండ్‌ యజమాని. పురంపోలి అమ్మడం ద్వారా భాస్కర్ ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడు. ఇది ఒక రకమైన సాంప్రదాయ వంటకం. ఇది మహారాష్ట్రలో చాలా ప్రసిద్ధి చెందింది. ఇది పండుగలు, ప్రత్యేక సందర్భాలలో తయారు చేస్తారు. ఇది ఓ రకమైన స్వీట్ లాగా ఉంటుంది. ఇది తీపి, మృదువైన రొట్టె, లోపల తీపి నింపి ఉంటుంది. కె.ఆర్ భాస్కర్ కథ గురించి ఇప్పుుడు తెలుసుకుందాం..

READ MORE: Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద..

భాస్కర్ 12 ఏళ్ల వయసులో బెంగళూరులోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పని చేయడం ప్రారంభించాడు. ఐదేళ్లపాటు హోటల్‌లోని టేబుల్స్‌, పాత్రలు శుభ్రం చేశాడు. ఆ తర్వాత 8 ఏళ్లపాటు నాట్య శిక్షకుడిగా కొనసాగాడు. అతను పాన్ షాప్ కూడా తెరిచాడు. కానీ దీని నుంచి పెద్దగా సంపాదించలేదు.23 సంవత్సరాల వయస్సులో, భాస్కర్ ముంబై వీధుల్లో సైకిల్‌పై పురాన్‌పోలి అమ్మడం ప్రారంభించాడు. ఇక్కడి నుంచి అతడి అదృష్టం మారిపోయింది. కుకింగ్ షోలో ఎంపికయ్యా్కై గుర్తింపు తెచ్చుకుని క్రమంగా తన బ్రాండ్‌ను ఏర్పరుచుకున్నాడు.

READ MORE:Stock Market Crash : కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. అయోమయంలో ఇన్వెస్టర్లు

ఈ రోజు భాస్కర్ దేశవ్యాప్తంగా ప్రతి 8 నెలలకు ఒక కొత్త అవుట్‌లెట్‌ను ప్రారంభిస్తున్నాడు. ఆయనకు కర్ణాటకలోనే 17 స్టోర్లు, 10కి పైగా ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఈ దుకాణాల ద్వారా అతని నెలవారీ సంపాదన దాదాపు రూ.18 కోట్లు. అతని వ్యాపారం రూ.3.6 కోట్ల నికర లాభం ఆర్జిస్తోంది. షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2లో కెఆర్ భాస్కర్ కష్టపడుతున్న రోజులను గుర్తు చేసుకున్నాడు. తాను బెంగుళూరులోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పని చేసేవాడిని క్రితం తెలిపాడు. కష్టపడి, అంకితభావంతో విజయం సాధిస్తారని భాస్కర్ కథ చెబుతోంది.