- బంగారం కొనేవారికి కాస్త ఊరట
- స్థిరంగా బంగారం ధరలు
- స్వల్పంగా తగ్గిన వెండి

Gold Price in Hyderabad Today: గత నెలలో భారీగా పడిపోయిన బంగారం ధరలు మళ్లీ ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. ఇటీవలి కాలంలో పసిడి ధరలు ఒకరోజు తగ్గితే.. మరోరోజు భారీగా పెరుగుతున్నాయి. భారీగా పెరిగిన తర్వాత స్వల్పంగా మాత్రమే తగ్గుతున్నాయి. శనివారం తులంపై వెయ్యికి పైగా పెరగగా.. పండగ వేళ కాస్త ఊరటనిస్తూ గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. దేశీయంగా నేడు (ఆగష్టు 19) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,770 వద్ద కొనసాగుతోంది.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,920గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,700 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,770గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,700గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,770 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ.66,700గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.72,770గా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,700 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,770గా నమోదైంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.66,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,770గా కొనసాగుతోంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,700గా.. 24 క్యారెట్ల ధర రూ.72,770గా ఉంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.66,700 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,770 వద్ద నమోదైంది.
మరోవైపు నేడు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. సోమవారం (ఆగష్టు 19) బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.85,900గా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండిపై రూ.100 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ85,900లుగా ఉండగా.. చెన్నైలో రూ.91,000లుగా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.83,000గా.. హైదరాబాద్‌లో రూ.91,000లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ.91,000ల వద్ద కొనసాగుతోంది.