Leading News Portal in Telugu

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్‌ సూచీలు


  • ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్‌ సూచీలు

  • ఆటో.. బ్యాంకింగ్ మినహా దాదాపు అన్ని రంగాలకు లాభాలు
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌‌లో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్ ఉదయం లాభాలతో ట్రేడ్ అయింది. చివరికి అస్థిరత మధ్య మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 12 పాయింట్లు నష్టపోయి 80,424 దగ్గర ముగియగా.. నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 24, 572 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.87 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Minister Uttam: సాంకేతిక కారణాలతో కాని వారికి త్వరలో రుణమాఫీ..

నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఎల్‌టీఐమైండ్‌ట్రీలు లాభపడగా.. ఎం అండ్ ఎం, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ మరియు ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ నష్టపోయాయి. ఆటో, బ్యాంకింగ్ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి.

ఇది కూడా చదవండి: Harish Shankar: త్రివిక్రంతో గొడవలు.. అసలు విషయం బయటపెట్టిన హరీష్ శంకర్